హ్యకర్ల దుశ్చర్య.. యూట్యూబ్‌లో ప్రముఖుల టాప్ వీడియోలు డిలీట్..
హాలీవుడ్ చిత్రానికి సంబంధించిన, పలువురు ప్రముఖుల వీడియోలను తొలగిస్తూ హ్యకర్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. హ్యాకర్లు తొలగించిన వీడియోలలో ఇటీవల కాలంలో అత్యధికంగా వ్యూస్‌ను సాధించిన డెస్పాసిటో ఒకటి. హ్యకర్ల బారిన పడిన వారిలో హాలీవుడ్ పాప్ సింగర్లు షకీరా, టేలర్ స్విఫ్ట్, సెలెనా గోమెజ్, డ్రేక్, క్రిస్ బ్రౌన్, డీజే స్నేక్ తదితరులు ఉన్నారు.

డెస్పాసిటో అనే ఆల్బమ్ యూట్యూబ్‌లో సంచలనం రేపింది. దాదాపు 5 బిలియన్ల వ్యూస్ సాధించింది. అయితే అలాంటి వీడియోను హ్యకర్లు తొలగించి దాని స్థానంలో గన్స్ పట్టుకొన్న ఓ గ్యాంగ్ ఫోటోను పెట్టారు. పాలస్తీనాకు విముక్తి కలిగించాలి అని ఓ సందేశాన్ని పెట్టారు. తాము ప్రోసోక్స్, కురోయిష్ సంస్థకు సంబంధించిన వాళ్లం అని హ్యాకర్లు పేర్కొన్నారు. ఇదంతా వినోదం కోసమే చేశాం అని వారు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హ్యకింగ్‌కు గురైన ఫొటోలను వెంటనే (మంగళవారం) మళ్లీ రీలోడ్ చేశారు.


Click it and Unblock the Notifications











