బుల్లితెర సీరియల్ లో స్టార్ హీరోయిన్
అంతరిక్షంలో ఒక సంవత్సరం పాటు విధులు నిర్వహించి వచ్చిన ఓ స్త్రీ మళ్లీ తన కుటుంబంలో భాగస్వామిగా మారే క్రమంలో ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ధారావాహిక నడుస్తుంది. ఈ సీరియల్ స్క్రిప్టు బాగా వచ్చిందని అందుకే తాను నటిస్తున్నానని చెప్తోంది. అలాగే స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి స్టార్ డైరక్టర్ దర్శకత్వం వహించటం మరో ఆకర్షణ.
హాలీబెర్రీ మాట్లాడుతూ... ''నేనెప్పుడూ వైవిధ్యమైన పాత్రల్ని పోషించాలనుకుంటాను. ఈ ధారావాహిక కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే ఇది సినిమానా, టీవీనా అని చూసుకోలేదు. నటించడానికి అంగీకరించాను'' అని చెప్పింది. హాలీబెర్రీ టీవీ కార్యక్రమంలో నటించడం ఇది రెండోసారి. తొలుత 1991లో 'క్నాట్స్ లాండింగ్' అనే సిరీస్‌లో నటించింది.
ఆస్కార్ అవార్డు విజేత హాలీ బెర్రీకి ఐదు సంవత్సరాల నహ్లా అనే కూతురు ఉంది. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ గాబ్రియల్ అబ్రీతో కలి సి జీవించినప్పుడు పాప పుట్టింది.హాలీవుడ్ హాటెస్ట్ మామ్ పోల్‌లో ఈ సెలబ్రిటీకి 24 శాతం ఓట్లు దక్కి అగ్రస్థానంలో నిలవడం విశేషం. హాటెస్ట్ మామ్‌గా అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.


Click it and Unblock the Notifications












