»   » డేటింగ్ కి ఉత్సాహం చూపిస్తున్న జేమ్స్ బాండ్ గర్ల్..!

డేటింగ్ కి ఉత్సాహం చూపిస్తున్న జేమ్స్ బాండ్ గర్ల్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ప్రస్తుతం హాలీవుడ్ లో ఎక్కడ చూసిన రూమర్స్. ఇటీవల ఈ రూమర్స్ ఉచ్చులో మరోకొత్త జంట చిక్కుకుంది. ఆ జంట ఎవరో కాదు జేమ్స్ బాండ్ గర్ల్ హాలీబెర్రి మరియు ఓలివిర్ మార్టినెజ్. ఈ జంట ఇద్దరూ కలసి డార్క్ టైడ్ అనే సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా వీరిద్దరికి ఒకరిగురించి బాగా తెలుసని అంటున్నారు. ఇటీవల వీరిద్దరూ చేయి చేయి పట్టుకోని చెట్టాపట్టాలేసుకోని లండన్ వీధుల్లో అందరికి దర్శనమిచ్చారు. దానితో వీరిద్దరూ డేటింగ్ లో పాల్గోంటున్నారని అందరూ తేల్చేశారు. దానితో పాటు వీరిద్దరూ కలసి పారిస్ మొత్తం తిరిగేస్తున్నారని, అలాంటి సమయంలో హాలీబెర్రి తన బాయ్ ప్రెండ్ చేతిని అసలు వదలడంలేదంట. ఇది చూసిన జనం అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరిని పెళ్శి చేసుకోని విడాకులు తీసుకున్నా ఇంకా బుద్ది రాలేదని హాలీవుడ్ జనాలు చెవులు కోరుకుంటున్నారు.

ఈ విషయంపై హాలీబెర్రి మాట్లాడుతూ ఓలివిర్ తో స్నేహాం చాలా బాగుంటుందని, తన దగ్గర నాకు చాలా ఫ్రీడమ్ ఉంది. అందుకే అలా చేశాను అని తన మనోభావాలను వెల్లడించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu