»   » ఆమె మళ్లీ విడాకులు తీసుకుంటోంది

ఆమె మళ్లీ విడాకులు తీసుకుంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ సెలబ్రెటీల జీవితాల్లో డేటింగ్, విడాకులు అత్యంత కామన్ గా మారుతున్నాయి. ఉన్నవారికి విడాకులు ఇచ్చేసి కొత్తవారిని వెతుక్కోవటం అక్కడో ఫ్యాషన్. అయితే తాము ఎడ్జెస్ట్ కాలేకే తమ పార్టనర్స్ తో విడాకులు కు వెళ్తున్నామని సదరు సెలబ్రెటీలు సెలవిస్తూంటారు. తాజాగా హాలీవుడ్ స్టార్, జేమ్స్ బాండ్ హీరోయిన్ హ్యాలీ బెర్రీ మరోసారి విడాకుల లిస్ట్ లో చేరుతోంది.

'డార్క్‌ టైడ్‌' చిత్రం సెట్‌లమీదే హ్యాలీ బెర్రీ 2010లో నటుడు ఆలివర్‌ మర్టినెజ్‌ను కలుసుకుంది. చూపులు కలిసిన ఆ ఇద్దరిమధ్యా బంధం పెరిగి ఆ ఏడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో వారికి మాసియో- రాబర్ట్‌ పుట్టాడు. ఆమెకు అంతక్రితం, మోడల్‌ గేబ్రియల్‌ ఆబ్రీతో డేటింగ్‌ కారాణంగా నహ్లా అనే కుమార్తె కూడా పుట్టింది. ఇప్పుడు ఆమె ఆలివర్‌కు విడాకులు ఇస్తునట్లు ప్రకటించింది.

Halle Berry and Olivier Martinez are divorcing

హ్యాలీ బెర్రీకు ఆలివర్‌ మూడో భర్త. 1993 నుంచి 1997 వరకూ ఆమె తన తొలి భర్త, బేస్‌బాల్‌ ప్లేయర్‌ డేవిడ్‌ జస్టిస్‌తో ఉండేది. తర్వాత ఆమె 2001లో సింగర్‌ ఎరిక్‌ బెనెట్‌ను వివాహమాడింది. నాలుగేళ్ల కాపురం తర్వాత, 2005లో బెనెట్‌కు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాతే, ఆలివర్‌ను పెళ్లాడింది.

ఆలివర్‌తో విడాకులు తీసుకున్నాక, ఆమె వైవాహిక జీవితం రికార్డు ప్రస్తుతం ముగ్గురు భర్తలు, ఒక ప్రియుడి దగ్గర ఆగుతోంది. అయితే, ఆలివర్‌కు మాత్రం ఈమే తొలి భార్య. హ్యాలీని కలవడానికి ముందు, అయన సింగర్‌ కైలీ మినోగ్‌తో డేటింగ్‌ చేసేవాడు. ఈ విడాకుల అనంతరం, ఈ 49 ఏళ్ల జంట మళ్లీ తమతమ జీవితాల్లోకి కొత్తవారిని ఆహ్వానించాల్సి ఉంటుంది.

English summary
Halle Berry and Olivier Martinez announced they were divorcing after just two years of marriage. “It is with a heavy heart that we have come to [this] decision,” the actors said in a joint statement. “We move forward with love and respect for one another.”
Please Wait while comments are loading...