»   » నగ్నంగా నటించి ఇచ్చిన డబ్బులు మేం తీసుకోం..అది మాదేవునికి విరుద్ధం..

నగ్నంగా నటించి ఇచ్చిన డబ్బులు మేం తీసుకోం..అది మాదేవునికి విరుద్ధం..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pamela Anderson
బేవాచ్ స్టార్ పమేలా ఆండర్సన్ ఇటీవల కాలంలో వచ్చినటువంటి జనవరి ఇష్యూ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చిన విషయం అందరికి తేలిసిందే. దీనికి గాను ప్లేబాయ్ మ్యాగజైన్ పమేలా ఆండర్సన్ కు25,000డాలర్సు చెల్లించింది. ఈమొత్తాన్ని పమేలా ఆండర్సన్ ఇటీవల కాలంలో ఇండోనేషియాలో వరదల సంభవించి ఇబ్బందులకు గురైనటువంటి వేవ్స్ 4 వాటర్ అనే ఛారిటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈమొత్తాన్ని ఇండోనేషియాలో త్రాగునీరు ఇబ్భందులకు గురైనటువంటి ఆప్రాంతాలకు ఉపయోగించవలసిందిగా కోరారు.

దీనిపై స్పందించినటువంటి ఇస్లామిక్ మత పెద్దలు పమేలా ఆండర్సన్ ఇచ్చినటువంటి ఆసహాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. దానికి కారణం లేకపోలేదన్నారు మతపెద్ద హాబీబ్ ఉమర్ సలీమ్. పమేలా ఆండర్సన్ తను నగ్నంగా ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిచ్చి తద్వారా వచ్చినటువంటి డబ్బును మాకివ్వడం జరిగింది. అలా సంపాదించిన డబ్బు తీసుకోవడం మా దేవునికి సంబంధించి చెడిపోయినదిగా మాకు అనిపిస్తుంది అందుకే మేము ఆడబ్బును సున్నితంగా తిరస్కరించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా మేము ఈడబ్బుని తీసుకున్నట్లైతే ఇప్పడు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ నష్టాన్ని మేము చూడాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయాన్ని వారు పబ్లిక్ గాఅందరి ముందు తెలియజేశారని న్యూయార్ టైమ్స్ పత్రిక పేర్కోంది.

దీనిపై స్పందించినటువంటి పమేలా ఆండర్సన్ మళ్శీ తను రెండవ సారి ప్లేబాయ్ కవర్ పేజిపై దర్శనమిచ్చి ఈసారి వచ్చేటటువంటి డబ్బుని వేవ్స్ 4 వాటర్ ఛారిటీకి ఇవ్వదలచామని ప్లేబాయ్ మ్యాగజైన్ అధిపతి మరియు తాను నిర్ణయించుకున్నామని అన్నారు. దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే ఈసారి కవర్ పేజిపై పమేలా ఆండర్సన్ మామూలు దుస్తులలో కనిపించనుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu