»   » విమాన ప్రమాదం ...హాలీవుడ్‌ నటుడు ఫోర్డ్‌కు గాయాలు

విమాన ప్రమాదం ...హాలీవుడ్‌ నటుడు ఫోర్డ్‌కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ ఏంజిలెస్‌: హాలీవుడ్‌ నటుడు హ్యారిసన్‌ ఫోర్డ్‌ (72) శుక్రవారం అమెరికాలో ఒక విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నడుపుతున్న చిన్నపాటి విమానం ఒకటి కాలిఫోర్నియాలో కూలిపోయింది. ఫోర్డ్‌ నడుపుతున్న విమానం రెండో ప్రపంచ యుద్ధం నాటిది. శాంటా మోనికా విమానాశ్రయం నుంచి అది టేకాఫ్‌ అయ్యింది. కొద్దిసేపటికే ఇంజిన్‌ మొరాయించింది.

Harrison Ford injured in plane crash

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విషయాన్ని ఫోర్డ్‌.. విమానాశ్రయ కంట్రోల్‌ టవర్‌కు తెలియజేశారు. విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారు. ఈలోగానే లాస్‌ ఏంజిలెస్‌ ప్రాంతంలోని ఒక గోల్ఫ్‌ కోర్స్‌లో విమానాన్ని కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఇళ్లను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించడానికి ఆయన విమానాన్ని పక్కకు మళ్లించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. విమానం ముందుభాగం వచ్చి నేలను ఢీకొంది.

Harrison Ford injured in plane crash

సహాయ బృందాలు అక్కడికి చేరుకొని ఫోర్డ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఆయన స్పృహలోనే ఉన్నారని, ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మడిమ, కటి భాగంలో ఎముకలు విరిగాయని, వాటికి శస్త్రచికిత్సలు చేశామని తెలిపారు. స్టార్‌ వార్స్‌ శ్రేణితో పాటు ఇండియానా జోన్స్‌ వంటి చిత్రాలతో ఆయన బాగా గుర్తింపు పొందారు.

1999లోనూ ఆయన విమానప్రమాదాన్ని తప్పించుకున్నారు. 2000 సంవత్సరంలో ఆయన విమానం అత్యవసరంగా దిగింది. గత ఏడాది స్టార్‌వార్స్‌ సినిమా చిత్రీకరణలో ఆయన కాలు విరిగింది.

English summary
Harrison Ford was injured Thursday afternoon when his vintage single-engine airplane crashed on a golf course shortly after taking off from Santa Monica Airport.
Please Wait while comments are loading...