»   » 3 లక్షల కోట్లు కలెక్షన్: అసలు సిసలైన కలెక్షన్ కింగ్!

3 లక్షల కోట్లు కలెక్షన్: అసలు సిసలైన కలెక్షన్ కింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోల సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తే.... వారిని కలెక్షన్ కింగ్ అంటూ ఉంటారు సినిమా భాషలో...., మనకు మన టాలీవుడ్, పక్కనున్న కోలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలకు సంబంధించిన కలెక్షన్ కింగ్స్ గురించి మాత్రమే తెలుసు. కానీ ఓవరాల్ వరల్డ్ లో కలెక్షన్ కింగ్ గురించి మీకు తెలుసా? అతడే హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్.

ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. కెరీర్లో ఇప్పటి వరకు 41 సినిమాలు చేసారు. హాలీవుడ్ చిత్రాలు ఇండియానా జోన్స్, స్టార్ వార్స్, ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి చిత్రాల్లో ఆయన కీలకమైన పాత్రలు చోషించారు. ఆయన నటించిన సినిమాలు ఓవరాల్ గా ఇప్పటి వరకు 4.7 బిలియన్ డాలర్ల (3 లక్షల కోట్లకు పైగా) వసూళ్లు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆయనే నెం.1.

Harrison Ford Named As Highest Grossing Hollywood Actor

నిన్న మొన్నటి వరకు నెం.1 స్థానంలో శామ్యూల్ ఎల్ జాక్సన్ ఉండే వారు. ఆయన 68 సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు 4.6 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాయి. అయితే హారిసన్ ఫోర్డ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవాకెన్స్' చిత్రం 770 మిలియన్ యూఎస్ డాలర్లు వసూలు చేసింది.

ఈ సినిమాతో హరిసన్ ఫోర్డ్..... సినిమాలు వసూలు చేసిన మొత్తం 4.7 మిలియన్ యూఎస్ డాలర్లు చేరుకుంది. ఫలితంగా ఆయన హయ్యెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ యాక్టర్ గా రికార్డుల్లోకి ఎక్కారు.

English summary
Harrison Ford is the highest-grossing actor in Hollywood history, thanks to the unprecedented box office success of Star Wars: The Force Awakens.
Please Wait while comments are loading...