»   » షూటింగ్ లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

షూటింగ్ లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ సినిమా హ్యారీ పోటర్ సీక్వెన్స్ లో చివరి చిత్రంగా వస్తున్న హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హ్యాలోస్ సినిమా షూటింగ్ లో అపసృతి చోటుచేసుకుంది. గత శుక్రవారం నాడు జరిగిన ఈ ప్రమాదంలో హ్యారీ పోటర్ పాఠశాల భవంతి 'హొగ్వార్ట్స్' అగ్నికి ఆహుతయింది.

దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేప్పుడు ఫైర్ ఎఫెక్ట్స్ లో జరిగిన పొరపాటు వల్ల ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. అమాంతంగా రేగిన ఈ జ్వాలల్ని అదుపుచేయ్యడానికి చాలా సమయం పట్టింది. దీంతో పాఠశాల భవంతి పూర్తిగా దెబ్బతినింది. అదృష్టావశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో ఈ భవంతి సెట్ ను పునర్నిర్మించే పనిలో పడింది ఈ సినిమాను రూపొందిస్తున్న వార్నర్ బ్రదర్స్ సంస్థ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu