twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర హీనుడిగా మారిన ప్రముఖ నిర్మాత, ఆస్కార్ కమిటీ నుండి తొలగింపు!

    హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ ఆస్కార్ కమిటీ నుండి తొలగించబడ్డాడు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలే కారణం.90 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆస్కార్ కమిటీ హిస్టరీలో వెలివేయబడ్డ రెండో వ్యక్తి హార్వే వెయి

    By Bojja Kumar
    |

    హాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ సెక్స్ స్కాండల్ వ్యవహారం చివరకు అతడిని మూవీ మొఘల్ స్థాయి నుండి చరిత్ర హీనుడిగా దిగజారేలా చేసింది. తాజాగా ఆస్కార్ అవార్డుల కమిటీ ( అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్‌ సైన్సెస్‌) మెంబర్‌షిప్ కూడా పోగొట్టుకున్నాడు.

    హామ్‌ హంక్స్‌, వూపి గోల్డ్‌బర్గ్‌, స్టీవెన్‌ స్పీల్ బర్గ్‌ వంటి దిగ్గజాలు ఉన్న 54 మందితో కూడిన ఆస్కార్‌ కమిటీ.... అతడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్‌ సైన్సెస్‌ చరిత్రలో..... బోర్డు సభ్యులచే వెలివేయబడ్డ రెండో వ్యక్తి హార్వే వెయిన్‌స్టెయిన్ కావడం గమనార్హం. వెయిన్‌స్టెయిన్ కంటే ముందు గాడ్ పాదర్ యాక్టర్ కార్మైన్ కారిడి కమిటీ నుండి తొలగించబడ్డారు.

    అతడి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు రావడం వల్లనే

    అతడి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు రావడం వల్లనే

    హర్వే వెయిన్‌స్టెయిన్‌పై గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వారి వల్ల ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డపేరు వచ్చింది. అలాంటి వ్యక్తులు కమిటీలో కొనసాగడం మంచింది కాదు. ఇతడి తొలగింపు మిగతా వారికి ఓ గుణపాఠం కావాలి' అని అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్‌ సైన్సెస్‌ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

    హార్వే వెయిన్‌స్టెయిన్ వ్యతిరేకంగా ఉద్యమం

    హార్వే వెయిన్‌స్టెయిన్ వ్యతిరేకంగా ఉద్యమం

    హర్వే వెయిన్‌స్టెయిన్‌ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏంజలీనా జోలీ, గైనెత్ పాల్ట్రోతో సహా పలువురు ప్రముఖ నటీమణులు అతడి సెక్స్ వేధింపుల గురించిబయట పెట్టారు. హార్వేకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఉద్యమం సాగుతోంది.

    ఒక్కొక్కటిగా బయట పడుతున్న దురాగతాలు

    ఒక్కొక్కటిగా బయట పడుతున్న దురాగతాలు

    హార్వే వెయిన్‌స్టెయిన్ దురాగతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. హార్వే వెయిన్‌స్టెయిన్ ద్వారా అత్యాచారానికి గురికాబడి, తమ సినిమా కెరీర్ పాడవుతుందనే భయంతో మిన్నకుండి పోయిన నటీమణులు సైతం ఇపుడు బయటకు వచ్చి అతడి దురాగతాలు బయట పెడుతున్నారు.

    చివరకు సోదరుడు కూడా

    చివరకు సోదరుడు కూడా

    వెయిన్‌స్టెయిన్‌ మీద లైంగక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో వెయిన్ స్టోయిన్ కంపెనీ నుంచి వెలివేస్తున్నట్లు అతడి సోదరుడు బాబ్‌ వెయిస్టెన్‌ ప్రకటించాడు. తన సోదరుడు ఓ మృగమంటూ బాబ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

    English summary
    The board of the Academy of Motion Picture Arts and Sciences on Saturday voted to revoke the membership of Harvey Weinstein, the Hollywood mogul who is accused of sexually harassing and assaulting women for nearly 30 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X