»   » మరో పెళ్లికి సిద్దమవుతున్న హాట్ బ్యూటీ

మరో పెళ్లికి సిద్దమవుతున్న హాట్ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ మరో పెళ్లి చేసుకోవడాకి సిద్దమవుతుందా? అంటే అవుననే అంటున్నారు హాలీవుడ్ మీడియా వర్గాలు. ఆమె లీగల్ రీసెర్చర్ డేవిడ్ లుకాడోను పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా అతనితో క్లోజ్‌గా ఉంటున్న బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల తన చేతి వేలికి గోల్డ్ర్ రింగుతో దర్శనమిచ్చింది. దీంతో వీరి వివాహానికి సంబంధించిన వార్తలపై అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఇంతకు ముందు బ్రిట్నీ స్పియర్స్ తన మాజీ ఏజెంట్‌ జాసన్ ట్రావిక్‌తో కొంత కాలం సహాజీవనం చేసింది. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు కానీ ఎందుకనో అది ఆచరణకు నోచుకోలేదు. అతనితో విడిపోయాక లీగల్ రీసెర్చర్ డేవిడ్ లుకాడోకు దగ్గరైంది ఈ హాట్ బ్యూటీ.

32 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్ ఇది మూడవ వివాహం. అంతక ముందు తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ని చేసుకోగా.. ఆ తర్వాత డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి నుండి స్పియర్స్ విడిపోయారు. డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌తో కలిసి సంసారం చేసినప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సీన్ ఫ్రెస్టన్ వయసు 8 సంవత్సరాలు కాగా.. జేడన్ జేమ్స్ వయసు 7 సంవత్సరాలు.

English summary

 Pop star Britney Spears has sparked rumours of her marriage to legal researcher David Lucado after she was spotted wearing a gold band recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu