»   » సెక్స్ స్కాండల్స్: 8ఏళ్ల తర్వాత ఆ గుట్టు బయటపెట్టిన కేట్ విన్‌స్లెట్..

సెక్స్ స్కాండల్స్: 8ఏళ్ల తర్వాత ఆ గుట్టు బయటపెట్టిన కేట్ విన్‌స్లెట్..

Subscribe to Filmibeat Telugu
కోరికలు తీర్చమని వేధించేవాడు.. తట్టుకోలేకపోయా..

హాలీవుడ్.. ఒక వేశ్యాలయం అన్న మార్లిన్ మన్రో మాటలను అంత ఈజీగా మరిచిపోలేం. తెరపై అవకాశాలకు.. తెర వెనుక చీకటి భాష్యం ఉండవచ్చు. కొన్ని రాత్రులు ఓ శవంలా నలిగిపోతే తప్ప.. తెర మీద తన బొమ్మ పడకపోవచ్చు. గుట్టుగా ఉండిపోయే ఈ నిశ్శబ్దాన్ని ఎవరో ఒకరు బద్దలుకొట్టకపోరు.

మార్లిన్ మన్రో ఈ నిశ్శబ్దాన్ని ఏనాడో బద్దలు కొట్టగా.. ప్రముఖ హాలీవుడ్ నటులు 'మీ టూ' అంటూ ఇప్పుడు గొంతెత్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ కేట్ విన్ స్లెట్ కూడా హాలీవుడ్ లో జరుగుతున్న ఈ పరిణామాలపై స్పందించింది. ఆ విషయాలు మీకోసం..

సిల్వెస్టర్ స్టాలోన్‌ రేప్ చేశాడు.. బాడీగార్డ్‌తో కలిసి శృంగారం.. ఓరల్ సెక్స్‌ ..కొట్టేవాడు..

భరించడం కష్టం..:

భరించడం కష్టం..:

అందరూ చెబుతున్నట్లే హార్వీ వెయిన్‌స్టీన్‌ లాంటి నిర్మాతను భరించడం కష్టం అని కేట్ చెప్పడం గమనార్హం. తన మొదటి సినిమా 'హెవెన్లీ క్రియేచర్స్'కు హార్వీ ఓ నిర్మాత అని గుర్తు చేసిన ఆమె.. సినిమా తర్వాత తాను ఎక్కడ ఎదురుపడ్డా.. 'నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా' అంటుండేవాడని చెప్పుకొచ్చారు.

'ఛాన్స్' పేరుతో..:

'ఛాన్స్' పేరుతో..:

'నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా..' అనడంలో హార్వీ అంతరార్థమేంటో పసిగట్టడం అంత కష్టమేమి కాదు. ఆ అంతరార్థాన్ని పసిగట్టాను కేట్ విన్ స్లెట్ పసిగట్టింది. కాబట్టే.. 'ది రీడర్' సినిమాకు ఆస్కార్ అందుకున్న సమయంలోనూ అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.

ఆ సినిమాకు ఆస్కార్..:

ఆ సినిమాకు ఆస్కార్..:

2009లో కేట్ విన్ స్లెట్ నటించిన 'ది రీడర్' సినిమాకు హార్వీ వెయిన్ స్టీన్ కూడా ఫైనాన్స్ అందించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించాడు. ఆ సినిమాకు కేట్ విన్ స్లెట్‌కు ఆస్కార్ కూడా వచ్చింది.

అప్పట్లో మాట్లాడలేదు..:

అప్పట్లో మాట్లాడలేదు..:

'ది రీడర్' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకునే రోజు.. నిర్మాత హార్వీ గురించి మాట్లాడాల్సిందిగా ఎంతోమంది కేట్ విన్ స్లెట్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే కేట్ మాత్రం ఎవరి వాదననను పట్టించుకోలేదు. తన స్పీచ్ లో ఒక్క ముక్క కూడా హార్వీ గురించి మాట్లాడలేదు. కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు.

8ఏళ్ల తర్వాత..:

8ఏళ్ల తర్వాత..:

ఆ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. హాలీవుడ్ లో ఇప్పుడంతా లైంగిక వేధింపుల గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో.. అప్పటి మౌనాన్ని గురించి ఎట్టకేలకు ఎనిమదేళ్ల తర్వాత కేట్ బయటపెట్టారు. లైంగికంగా తనకు వల వేసేందుకు హార్వీ పరోక్షంగా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు.

వాడు ఇవ్వడమేంటి?:

వాడు ఇవ్వడమేంటి?:


'నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా' అని హార్వీ ప్రతీసారి అంటుండేవాడు. వాడు నాకు ఆఫర్ ఇవ్వడమేంటి?.. నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను. అదే సినిమాకు మూడు సార్లు అడిషన్ చేశాను.

ఎప్పుడూ కలిసినా రూడ్ గా మాట్లాడేవాడు. అయితే నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేంత సీన్ లేదు అతనికి. అలాంటి వాడు కాబట్టే.. అప్పటి ఆస్కార్ వేడుకలో హార్వీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు అని కేట్ వివరించారు.

ఉద్యమంలా..:

ఉద్యమంలా..:

ప్రస్తుతం హాలీవుడ్ లో లైంగిక వేధింపుల పర్వంపై గొంతు విప్పడం.. ఓ ఉద్యమంలా సాగుతోంది. ఒక రకంగా హాలీవుడ్‌ను సెక్స్‌ స్కాండల్‌వుడ్‌ అంటున్నవారూ లేకపోలేదు.

హార్వీ వెయిన్ స్టీన్, ఓలివర్‌ స్టోన్, సిల్వెస్టర్‌ స్టాలోన్, అల్‌ ఫ్రాంకెన్, గారిసన్‌ కిల్లర్, లూయిస్‌ సీకె, కెవిన్‌ స్పేసీ, చార్లీ షీన్‌.. ఇలా చాలామంది హాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

English summary
She's an Academy Award-winning actress who has been vocal about her dismay for fallen movie mogul Harvey Weinstein.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X