twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి ఆస్కార్ అవార్డు ఆసినిమాకే అంటున్న ఆస్కార్ అవార్డు గ్రహీత

    By Nageswara Rao
    |

    హాలీవుడ్‌లో ఇటీవల విడుదలైనటువంటి 'ద కింగ్స్ స్పీచ్' సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేస్తూ ముందుకు దూసకుపోతున్న విషయం తేలిసిందే. అంతేకాకుండా ఈసినిమా ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఈసందర్బంలో హీరోయిన్ డామి హెలెన్ మిర్రన్ మాట్లాడుతూ ఈసంవత్సరం జరిగేటటువంటి ఆస్కార్ అవార్డులలో ఈసినిమాలో నటించినటువంటి హీరో కోలిన్ ఫిర్త్‌కి గ్యారంటీగా అస్కార్ అవార్డు వస్తుందని తన నమ్మకాన్ని తెలిపారు. ఈసినిమాలో తను చేసినటువంటి యాక్షన్ అంతలా మంత్ర ముగ్దుల్ని చేసిందని అన్నారు.

    ఈ అరవై అయిదు సంవత్సరాల స్టార్ హీరోయిన్ డామి హెలెన్ మిర్రన్ 2006వ సంవత్సరంలో 'ద క్వీన్' అనే సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈసందర్బంలో ఆస్కార్ అవార్డు అనేది ఫిల్మ్ రంగంలో ఓ అరుదైన గౌరవం అని అన్నారు. ఈ అకాడమి అవార్డు వల్ల తన జీవితం ఏమి మారదు అని నేను అనుకుంటున్నాను అని అన్నారు. నాకు తెలిసి అతనికి మాత్రమే వంద శాతం ఆస్కార్ అవార్డు గెలుచుకోనే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

    ఈ సినిమాలో నేను కూడా నటించినందుకు నాకు చాలా గౌరవంగా ఉందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఒక బ్రిటిష్ యాక్టర్‌గా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నానని అన్నారు. జీవితంలో ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పురాదు అని అన్నారు. కోలిన్ ఫిర్త్ ఈసినిమా ద్వారా ఇప్పటికే వరల్డ్ ఫేమస్ ఫిగర్ అయ్యాడు. ఇక ఈఆస్కార్ అవార్డు అతని జీవితానికి ఓ కొలమానంగా ఉంటుందని అన్నారు.

    English summary
    Actress Dame Helen Mirren says she is confident that Colin Firth will win the Best Actor Oscar for his role in ''The King's Speech''. But the 65-year-old actress - who won the Best Actress Oscar for her role in 2006's ''The Queen'' – explained she doesn't think the Academy Award will change his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X