For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హిట్టైంది,ప్రమోట్ చేసా...ఇక రిలాక్స్...వెకేషన్

  By Srikanya
  |

  హైదరాబాద్ : నిఖిల్ తాజా చిత్రం "సూర్య Vs సూర్య" మూడు వారాల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాథించందంటూ నిఖిల్ ఫారిన్ లొకేషన్స్ కు వెకేషన్స్ కు వెళ్లిపోయాడు. అయితే వెకేషన్స్ కు వెళ్ళేముందు తన భాధ్యతగా చిత్రాన్ని ప్రమోట్ చేసి మరీ వెళ్లాడు. ఆ వెకేషన్ లోదే ఈ ఫొటో.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ ఫొటోని షేర్ చేస్తూ నిఖిల్ ఇలా రాసుకొచ్చారు..."సూర్య Vs సూర్య 3వ వారం వీకెండ్ సూపర్. కార్తికేయ,సూర్య తర్వాత నేను ప్రమోషన్ పూర్తి చేసి రిలాక్స్ అవటానికి వెళ్లిన వెకేషన్ ఇది", అంటూ ట్వీట్ చేసారు.

  చిత్ర నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘మా చిత్రం 11 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణ, ఓవర్సీస్ లో కలిసి 11 కోట్ల గ్రాస్ సాధించింది. ముందుగా మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ రోజు ప్రేక్షకులు అందించిన ఇంతటి ఘన విజయం మా కష్టాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. మా చిత్రం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మా సంస్థ నుండి ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను' అన్నారు.

  Hero Nikhil calls it vacation time

  చిత్రం కథేమిటంటే...

  ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొన్న ఈ కథ ఇది. ఈ కథలో సూర్య(నిఖిల్) కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన ఆ వ్యాధితో బాధపడుతూంటాడు. అయితే పగలు బయటకు రాలేని సూర్య.... పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే తనకు జబ్బున్న విషయం ఆమెకు దగ్గర దాస్తాడు..ఎక్కడ ఆమె రిజెక్టు చేస్తుందో అనే భయంతో...అయితే ఓ రోజు ఆమె పగలు తన ఇంటికి వచ్చి మాట్లాడమనటంతో ...తప్పనిసరి పరిస్దితుల్లో ఆ జబ్బు విషయం ఆమెకు రివిల్ అవుతుంది. దాంతో విషయం తెలుసుకున్న ఆమె, ఆమె తండ్రి అతన్ని ఏక్సెప్టు చేయరు. ఆ క్రమంలో సూర్య ఏం చేసాడు. తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. ప్రేమ కోసం తన జబ్బుని ఎలా జయించాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

  నిఖిల్, త్రిదా చౌదరి, తనికెళ్ల భరణి, మధువాల, రావు రమేష్, షాయాజీ షిండే, సత్య, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, అల్లరి సుభాషిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతం నెరసు, ఆర్ట్: టి.ఎన్.ప్రసాద్, కొరియోగ్రఫీ: విజయ్, ఫైట్స్: వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కృష్ణ చిన్ని, సంగీతం: సత్య మహవీర్, నిర్మాత: మార్కాపురం శివకుమార్, రచన-దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.

  English summary
  “Surya Vs Surya 3rd weekend super. Job done with the promotions and now got out of the country for a much needed break after Karthikey and Surya Vs Surya as it time to chill and relax”, says Nikhil, after landing in the foreign country.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X