»   » ఆస్కార్ బరిలో హిందీ సినిమా..!!

ఆస్కార్ బరిలో హిందీ సినిమా..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో ఓ హిందీ సినిమా నిలిచింది. గ్రెగ్ హెల్వే దర్శకత్వం వహించిన 'కవి' అనే ఓ సినిమా 82 వ ఆస్కార్ అవార్డు బరిలో షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది. ఈ సినిమా ది డోర్, ఇన్ స్టెడ్ ఆఫ్ అబ్రకదబ్రా, మిరాకిల్ ఫిఫ్, ది న్యూ టెనెంట్స్ సినిమాలతో పోటీపడనుంది.

ఇక ఈ సినిమా కథ ఇండియాలో వుండే కవి అనే బాలుడి చుట్టూ నడుస్తుంది. పాఠశాలకు వెళ్లి, అందరి పిల్లలలాగా క్రికెట్ ఆడాలని ఆశపడే బాలుడు ఓ ఇటుకల ఫ్యాక్టరీలో పనిచెయ్యాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ బాలుడి పరిస్థితి ఏంటనే సంతిని హృదయాన్ని హత్తుకునేలా తీసారు గ్రెగ్ హెల్వే. 19 నిమిషాల నిడివి వున్న ఈ సినిమా బాలకార్మికుల గురించి తీసారు. ముంబై పరిసరాల్లో 8 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తప్పక ఆస్కార్ గెలుస్తుందనే నమ్మకం తమకుందని గ్రెగ్ హెల్వే అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు ఆస్కార్ లభించాలని మనం కూడా కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu