Just In
- 7 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 9 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 41 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ హీరో ముసలివాడు.. ఆ విషయంలో చాలా దారుణం.. బ్రేకప్ చెప్పేసిన హీరోయిన్
హాలీవుడ్ నటుడు, గాడ్ ఫాదర్ ఫేం అల్ పసినోకు మరోసారి డేటింగ్ జీవితంలో చేదు అనుభవం ఎదురైంది. గత కొద్దికాలంగా ఇజ్రాయెల్ నటి మీటల్ దోహన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే తనకు, పసినోకు మధ్య అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయయని, అందుకే ఆయనతో తెగతెంపులు చేసుకొన్నాను అని మీటల్ వెల్లడించింది. మీడియాలో వస్తున్న బ్రేకప్ వార్తలను ధృవీకరించింది. ఈ బ్రేకప్ గురించిన వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

బ్రేకప్ నిజమే
గత నెలరోజులుగా అల్ పసినో ఒంటరిగా ఉండటంతో మీడియాలో అనేక రూమర్లు ప్రచారమయ్యాయి. దాంతో తమ రిలేషన్‌షిప్ గురించి చెప్పాలంటూ మీటల్‌కు మీడియా నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో పసినోతో బ్రేకప్ జరిగింది నిజమే. ఆ వార్తల్లో వాస్తవం ఉంది. వయసు వ్యత్యాసమే తమ రిలేషన్‌షిప్ అర్ధాంతరంగా ముగియడానికి కారణం అని మీటల్ చెప్పింది.

ముసలివాడు కావడం వల్లే
అల్ పసినో లాంటి ముసలి వాడితో జీవితం గడపటం చాలా కష్టం. ఆయనకు 79 ఏళ్లు.. నాకు 43 ఏళ్లు. మా ఇద్దరి మధ్య వయసుపరంగా చాలా గ్యాప్ ఉంది. తొలుత ఆయనతో అఫైర్ వద్దనుకొన్నాను. కానీ ఆయనపై ప్రేమతో కాదనలేకపోయాను. బ్రేకప్ తర్వాత కూడా ఆయనపై నా ప్రేమ తరిగిపోదు అని మీటల్ వెల్లడించింది.

మహా పిసినారి.. డబ్బు ఖర్చు పెట్టడానికి
అల్ పసినో చాలా పిసినారి. డబ్బులు ఖర్చు పెట్టడానికి గింజులాడేవాడు. గిఫ్టులు ఇవ్వడానికి చాలా కష్టపడేవాడు. పూలు మాత్రమే కొని ఇచ్చేవాడు. నా కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడేవాడు. ఆ విషయం నాకు పెద్దగా నచ్చలేదు. కొన్ని విషయాల్లో చాలా గొడవలు జరిగాయి. అందుకే అతడిని వదిలేసి వచ్చాను అని మీటల్ దోహన్ వెల్లడించింది.

విడిపోయినా మంచి ఫ్రెండ్స్ గానే
హాలీవుడ్‌లో అల్ పసినోకు ఉన్న లెగసీ కారణంగానే డేటింగ్ చేశాను. మొత్తంగా రెండేళ్లు భరించాను. ఆయన అంటే ఇప్పటికే ఆరాధనాభావం ఉంది. విడిపోయినా భవిష్యత్‌లో కూడా మంచి స్నేహితులుగా ఉంటాం. ఆయన పసినారితనం, కుంచిత స్వభావాన్ని భరించలేకపోయాను అని మీటల్ వెల్లడించింది.

రెండేళ్లుగా డేటింగ్
హాలీవుడ్‌లో ఓ మూవీ స్క్రీనింగ్ నేపథ్యంగా జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో అల్ పసినోను కలుసుకొన్నాను. అలా రెండేళ్లపాటు ఆయనతో సన్నిహితంగా మెదిలాను. కానీ వయసులో ఉండే వ్యత్యాసమే మా ఇద్దరిని దూరం చేసింది. మా అభిప్రాయ భేదాలకు అది ఒక కారణం అని మీటల్ పేర్కొన్నది.