twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సినిమా ఓ చోట డిజాస్టర్..!! మరో చోట రికార్డ్ బ్రేకర్..!!

    By Srikanya
    |

    '2012' ఈ సినిమా విడుదలకు చివరి నిమిషం వరకూ ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టింస్తుందనే వార్తలు వినపడ్డాయి. అది ఖచ్చితంగా సాధ్యమని కూడా అనిపించింది. దీనికి కారణం ఈ సినిమాను 'ఇండిపెండెన్స్ డే', 'ది డే ఆఫ్టర్ టుమారో' వంటి చిత్రాలను నిర్మించిన దర్శకుడు రొనాల్డ్ ఎమ్రిచ్ రూపొందించడంతో పాటు ఈ సినిమా కు లభించిన భారీ పబ్లిసిటీ. సినిమా కు ముందు విడుదలయిన ట్రెయిలర్లు అద్భుతంగా వుండటంతో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ సినిమా చూశాకా ట్రెయిలర్లలో చూపించిన ఆ మూడు సీన్లు మాత్రమే అద్భుతంగా వుండి సినిమా మాత్రం వీక్ స్క్రీన్ ప్లే తో తేలిపోయింది. దీంతో ఈ సినిమా హాలీవుడ్ లో డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.

    కానీ ఈ సినిమా చైనా దేశంలో మాత్రం ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లను రాబడుతున్నట్టు సమాచారం. చైనా సినీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ హాలీవుడ్ సినిమా 460 మిలియన్ చైనీస్ యువాన్ల(67.3 మిలియన్ డాలర్లు) ను రాబట్టినట్టు చైనా ఫిలిం గ్రూప్ అసోసియేషన్ కు చెందిన వెంగ్ లీ ప్రకటించారు. దీంతో ఈ సినిమా ట్రాన్స్ ఫార్మర్స్ సినిమా నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి చైనా అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

    ఈ సినిమాలో చైనా లో జరిగే కొన్ని సన్నివేశాలు హైలెట్ కావడంతో పాటు చైనీయుల క్యాలెండర్ ప్రకారం 2012 వ సంవత్సరం యుగాంతం అని అక్కడి ప్రజల విశ్వాసం ఈ సినిమాకు బాగా కలసి వచ్చింది. చైనా లోనే కాదు అత్యధిక జనాభాలో చైనాతో పోటీ పడుతున్న భారతదేశంలో కూడా ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించడం గమనార్హం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X