Just In
- 17 min ago
చాలా కాలం తరువాత పవన్‌తో త్రివిక్రమ్.. చాయ్ గ్లాసుతోనే మొదలు పెట్టారు
- 24 min ago
ఆ ఒక్క మాటతో ఎంతో బాధ.. ఎస్పీబీపై చిరంజీవి ఎమోషనల్
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 2 hrs ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
Don't Miss!
- Sports
ఐపీఎల్ వేలం ముందు కుర్రాళ్లకు పరీక్ష.. నేటి నుంచి ముస్తాక్ అలీ క్వార్టర్ ఫైనల్స్!
- News
తిరుపతి కోసం బీజేపీ-జనసేన స్కెచ్-తెరపైకి కర్నాటక మాజీ సీఎస్-జగన్ కేసుల్లోనూ..
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
80 మందిపై లైంగిక దాడి, రేప్.. దర్శకుడిని దోషిగా తేల్చిన కోర్టు.. మూవీ మొఘల్‌కు 25 ఏళ్ల శిక్ష
లైంగిక దాడి, వేధింపుల కేసులో హాలీవుడ్ దర్శక, నిర్మాత హర్వే వెయిన్‌స్టెయిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో న్యూయార్క్ న్యాయస్థానం సోమవారం దోషిగా తేల్చడంతో హాలీవుడ్ పరిశ్రమలో సంచలనం చోటుచేసకొన్నది. ప్రముఖ దర్శకుడి ప్రవర్తనను తప్పుపడుతూ కోర్టు సంచలన తీర్పు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

పలు లైంగికదాడి కేసుల్లో
2006లో తనపై లైంగిక దాడి చేశారంటూ మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేయి నమోదు చేసిన కేసులోను, అలాగే 2013లో తనను రేప్ చేశారంటూ జెస్పికా మాన్ దాఖలు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు తీవ్రంగా స్పందించింది. పలు దఫాలు విచారించిన తర్వాత వెయిన్‌స్టెయిన్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో తీర్పును వాయిదా వేసింది. కేసు తీవ్రతను బట్టి వెయిన్‌స్టెయిన్‌కు సుమారు 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

శిక్ష ఖరారయ్యేంత వరకు కస్టడీలోనే
వెయిన్‌స్టెయిన్ దోషిగా నిర్ధారించిన అనంతరం న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మార్చి 11వ తేదీన శిక్ష ఖారారయ్యేంత వరకు వెయిన్‌స్టెయిన్‌ను కస్టడీలోనే ఉంచాలి అని సంచలన తీర్పు వెల్లడించింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలని వెయిన్‌స్టెయిన్ తరఫు న్యాయవాది చేసిన విన్నపాన్ని తోసిపుచ్చింది.

నడువలేక, ఇబ్బందిగా వాకర్ సహాయంతో
కోర్టులో విచారణ జరుగుతున్నంత సేపు వెయిన్‌స్టెయిన్ చాలా ఇబ్బందిగా కనిపించారు. నడవలేకపోవడంతో ఆయన వాకర్స్ సహాయంతో కోర్టు హాలులోకి ప్రవేశించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన న్యాయవాది భుజం మీద తలవాల్చి పడుకోవడం కనిపించింది. తన న్యాయవాది నుంచి ఆసరా తీసుకొంటూ కనిపించారు.

వెయిన్‌స్టెయిన్‌కు వ్యతిరేకంగా
విచారణ ప్రారంభమైన జనవరి 6వ తేదీన కోర్టు హాలు బయట పలువురు బాధితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వెయిన్‌స్టెయిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కోర్టు ప్రాంగణం వద్ద గందరగోళంగా కనిపించింది. కాగా, తాజా తీర్పును టైమ్స్ అప్ ఫౌండేషన్ స్వాగతించింది. న్యాయ రంగంలో సరికొత్త మైలురాయిగా వ్యాఖ్యలు చేసింది.


80 మంది మహిళలపై లైంగిక దాడి, రేప్
గత కొన్ని దశాబ్దాలుగా పలువురు ఔత్సాహిక తారలను వేషాలు, ఆఫర్ల పేరుతో మభ్యపెట్టి దారుణంగా హింసించారనే తీవ్రమైన ఆరోపణలు వెయిన్‌స్టెయిన్‌పై వచ్చాయి. ప్రముఖ హీరోయిన్లతోపాటు దాదాపు 80 మంది మహిళలను తమపై లైంగిక దాడి జరిపారని, అంతేకాకుండా రేప్ చేశారనే ఆరోపణలు చేయడంతో హాలీవుడ్‌లో ఈ కేసు సంచలనంగా మారింది.