»   » ప్రఖ్యాత నటుడికి అత్యవసర హార్ట్ సర్జరీ..డాక్టర్లు అలా చేయక తప్పలేదు!

ప్రఖ్యాత నటుడికి అత్యవసర హార్ట్ సర్జరీ..డాక్టర్లు అలా చేయక తప్పలేదు!

Subscribe to Filmibeat Telugu

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ తీవ్రమైన గుండె సమస్యతో ఆసుపత్రిపాలు అయినట్లు తెలుస్తోంది. గురువారం ఈ వెటరన్ నటుడికి గుండెలో తీవ్రమైన సమస్య తెలెత్తినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆర్నాల్డ్ ప్రస్తుత వయస్సు 70 ఏళ్ళు. గతంలో కూడా ఆయనకు హార్ట్ సమస్య తలెత్తినప్పుడు సర్జరీ నిర్వహించారు.ఆయనకు అమర్చిన కాథెటర్ వాల్వ్ లో సమస్య ఏర్పడడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించవలసి వచ్చినట్లు తెలుస్తోంది.

Hollywood veteran star Arnold Schwarzenegger undergoes open heart surgery

సర్జరీ తరువాత ఆర్నాల్డ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆర్నాల్డ్ పలు హాలీవుడ్ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగారు. ప్రొడ్యూసర్ గా కూడా రాణించారు. ఆర్నాల్డ్ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ గా సేవలందించారు. ఆర్నాల్డ్ క్షేమంగా ఆసుపత్రి నుంచి బయటకు రావాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. వైద్యులు ఆర్నాల్డ్ కు సర్జరీ నిర్వహించి కాథెటర్ వాల్వ్ ని మార్చినట్లు తెలుస్తోంది. ఆర్నాల్డ్ క్షేమంగా ఉన్నారని వైద్యులు సమాచారం అందించారు.

English summary
Hollywood veteran star Arnold Schwarzenegger undergoes open heart surgery. His condition is stable after heart surgery
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X