»   » అద్భుతమయిన అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకున్నాడు..!!

అద్భుతమయిన అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకున్నాడు..!!

Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డు పొందడం ఎంతో మంది జీవితాశయం, ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డులుగా పిలువబడే ఈ అవార్డుల్లో నామినేషన్ దక్కితేనే ఎంతో సంబరపడిపోతారు. అలాంటిది అవార్డు వస్తే ఇంకేముంది ఆనందంతో గెంతులేస్తారు, కొందరయితే ఆనందం పట్టలేక బోరున ఏడ్చేస్తారు. ఇప్పుడీయన కూడా అంతే..కానీ ఈ కథలో కొంచం తేడా... అవార్డు వచ్చినా దాన్ని సభామధ్యమున, ఎంతో మంది ప్రముఖుల ముందు అందుకోలేకపోయానని ఏడ్చుంటాడు. ఎందుకంటే ఆయన్ని ఆస్కార్ వేడుకలకు రావద్దని నిర్వాహకులు నిషేధించారు.

ఆయనే నికోలస్ చార్టయిర్. ది హర్ట్ లాకర్ సినిమా నిర్మాత. ఈ సినిమా ద్వారా తొలిసారి ఉత్తమ దర్శకురాలి అవార్డును పొందిన మహిళగా క్యాథరీన్ బిగిలోవ్ చరిత్ర సృష్టిస్తే ఈయన గారు తను నిర్మించిన చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చినా దాన్ని అందుకోలేకపోయిన నిర్మాతగా చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి అంటారా... ఆస్కార్ ఓటర్లలోని తన స్నేహితులకు ఓ ఈ-మెయిల్ పంపించడమే. ఈ మెయిల్ పంపినందుకే బహిస్కరించాలా అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే అసలు విషయం చదవండి..

సదురు ఈ-మెయిల్ లో ఆయన "దయుంచి మా సినిమా హర్ట్ లాకర్ కు ఓట్ చెయ్యండి, కానీ ఆ 500 మిలియన్ డాలర్లతో రూపొందిన సినిమా(అవతార్)కు వెయ్యకండని" మనవి చేసాడంట. దీంతో ఆయన తమ సినిమాకు ప్రధాన పోటీదారు అయిన అవతార్ సినిమా గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేసాడనే అభియోగంతో ఆయన్ని బహిష్కరించాడు. ఈ మెయిల్ పంపించిన వెంటనే తప్పును గ్రహించిన ఆయన వెంటనే క్షమాపనలు చెబుతూ మరో మెయిల్ పంపినా ఆస్కార్ నిబంధనల ప్రకారం ఆయనకు ఆస్కార్ వేడుకలకు హాజరయ్యే అర్హత లేదని చెప్పి బహిష్కరించారు. కానీ ఆయన అవార్డులు ప్రకటించిన రాత్రి తన సన్నిహితులతో ఆస్కార్ ను తలపించే విధంగా రెడ్ కార్పెట్ స్వాగతాలతో ఓ మినీ ఆస్కార్ వేడుకలు జరుపుకున్నట్టు తెలిసింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu