»   » లేటెస్ట్ రిలీజ్ : 'ది ఫిఫ్త్‌ వేవ్‌' ఎలా ఉందంటే...

లేటెస్ట్ రిలీజ్ : 'ది ఫిఫ్త్‌ వేవ్‌' ఎలా ఉందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : సైన్స్ పిక్షన్ చిత్రాలు నిరంతరం హాలీవుడ్ ని పలకరిస్తూనే ఉంటాయి. అయితే దాదాపు ఇవన్నీ ఒకే తరహా స్క్రీన్ ప్లే తో సాగుతున్నా ఇందులో వచ్చే కొత్త తరహా విజువల్స్, థ్రిల్స్ ఆ తరహా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయం సాధిస్తూనే ఉంటాయి. రీసెంట్ గా...'ది ఫిఫ్త్‌ వేవ్‌' అనే టైటిల్ తో ఓ హాలీవుడ్ చిత్రం మన ముందుకు వచ్చింది. ఇండియాలో సైతం భారీగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

చిత్రం కథేమిటంటే... ఏలియన్స్ దాడులతో.. మానవ జాతి మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఆ దాడిలో టీనేజి గర్ల్ కేసి (క్లో గ్రేస్‌ మారెట్జ్‌) చిక్కుకుంటుంది. ఈ కష్టాలకు తోడుగా...తమకు రక్షణ కల్పించిన శరణార్థి శిబిరం నుంచి తమ్ముడు శామ్‌ (జకరీ ఆర్థర్‌) దూరంగా వెళ్లి పోతాడు.

How is 'THE 5TH WAVE' movie?

ఆ సమయంలో గ్రహాంతరవాసుల దాడి నుంచి రక్షించుకోవటానికి ఆమె ఒంటరిగా బయల్దేరుతుంది. మరో ప్రక్క ఎలియన్స్ రాకెట్‌ దాడికి దిగుతారు. ఆ దాడిలో...ఆమె గాయపడుతుంది. తమ్ముడున్న ప్రాంతానికి చేరేసరికి.. ఎలియన్స్ దాడులు మరింత ముమ్మరమవుతాయి. అప్పుడు ఆమె ఏం చేసింది..ఆమెకు ఎవరు సాయిం చేసారు...ఎలియన్స్ ని ఎదుర్కొందా... చివరకు ఏం జరిగింది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


రిచర్డ్‌ ‘రిక్‌' యాన్సీ 2013లో రాసిన మూడు నవలల సిరీస్‌లో.. ‘ది ఫిఫ్త్‌ వేవ్‌' నవల మొదటిది. దీన్నే దర్శకుడు బ్లేక్సన్‌ సైన్స్‌ ఫిక్షన్‌- యంగ్‌ అడల్ట్‌- డ్రామా జోనర్‌లో అదే పేరుతో సినిమాగా రూపొందించారు.

English summary
Based on author Rick Yancey's novel of the same name, The 5th Wave is yet another sci-fi action movie with the hope of becoming the next big thing in young adult fiction. But as similar franchises continue to flood the market, new feature doesn't feel any different from what has come before, despite the extraterrestrial premise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu