»   » యస్..ఇది షాక్ ఇచ్చే నిజం: ఆస్కార్ విగ్రహం విలువ ఎంతో తెలుసా

యస్..ఇది షాక్ ఇచ్చే నిజం: ఆస్కార్ విగ్రహం విలువ ఎంతో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న వేడుక ఆస్కార్. సినిమారంగానికి నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకకోసం లాస్‌ఏంజిలిస్ సన్నద్ధమైంది. ప్రఖ్యాత దూల్బె థియేటర్‌లో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుఝామున జరిగే ఈ వేడుక అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి జరగబోతోంది. ఈ నేపధ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు అందుకోవాలని నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కలలు కంటుంటారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గోల్డెన్ ఆస్కార్ ను ఒక్కసారైనా ఇంటికి తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్టూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం కొద్దిమందికే వరిస్తూ ఉంటోంది. బంగారం వర్ణంలో మెరిసిపోయే ఆస్కార్ కు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. అలాంటి ఈ ఆస్కార్ విలువెంతో అసలు ఎప్పుడైనా, ఎవరైనా ఊహించారా?

బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆ ఆస్కార్‌ విగ్రహ తయారీకి అయ్యే ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! ఒక ఆస్కార్‌ విగ్రహం విలువ 10 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.666 మాత్రమే! అయితే ఒక్కో విగ్రహ తయారీకి అయ్యే ఖర్చు మాత్రం 400 డాలర్లు(రూ.26,655).

How much does it cost to win an Oscar?

ఒకవేళ ఈ అవార్డును వేలానికి పెట్టాలనుకుంటే దాని కన్నా ముందు ఏఎమ్‌పీఏఎస్‌ (అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్‌ అండ్‌ సైన్సెస్‌) కు 10 డాలర్లు చెల్లించాలన్నది రూల్ ఉంది. 2015 నుంచి ఈ రూల్ ని కోర్టు అమలుచేస్తూ వస్తోంది. ఈ రూల్ ను సమర్థిస్తూ వస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్, బెట్ డేవిస్, క్లార్క్ గేబుల్‌కు చెందిన ఆస్కార్‌లపై 1.36 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన ఇంత ఖర్చు చేశారట.

ఇక ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్ ల విషయానికి వస్తే.... ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి బాలీవడ్ నటి ప్రియాంక చోప్రా హాజరవుతున్నారు. హాలీవుడ్ హాస్యనటుడు జిమ్మి కెమ్మిన్ ఈ కార్యక్రమానికి సమర్పకుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ బరిలో భారతీయ సినిమాలుకాని, నటీనటులు కానీ లేనప్పటికీ 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ దీపక్ పోటీపడుతూండటం ఆసక్తిరేపుతోంది.

అకాడమీ అవార్డులుగా పిలిచే ఆస్కార్ ను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైనె్సస్ ప్రదానం చేస్తోంది. గత ఏడాది విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిశీలించి జనవరి 24 న నామినేషన్లను ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న 89వ ఆస్కార్ ఉత్సవంలో 24 విభాగాల్లో విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఆస్కార్ చరిత్రలో ఎక్కువ నామినేషన్లు పొందిన మూడో చిత్రంగా లా లా ల్యాండ్ చరిత్ర సృష్టించడం ఈసారి విశేషం.

14 కేటగిరీలలో ఈ చిత్రం నామినేషన్లు పొందింది. ప్రధాన కేటగిరీలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి విభాగాల్లో ఆస్కార్ వరించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. గతంలో 'ఆల్ ఎబౌట్ ఈవ్' (1950), టాటానిక్ (1997) మాత్రమే 14 నామినేషన్లు పొందాయి.

ముఖ్యంగా ఈ ఏడాది ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి తొమ్మిది చిత్రాలు రంగంలో ఉన్నాయి. వాటిలో నిజ జీవిత కథలకే అగ్రతాంబూలం దక్కడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఓ భారతీయ కుర్రాడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఓ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం.

విదేశాలనుంచి అమెరికా వచ్చేవారిపై ఉన్న ఆంక్షలకు నిరసనగా అవార్డుల బరిలో ఉన్న నటీనటుల్లో కొందరు హాజరుకావడం లేదు. కాగా హాలీవుడ్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి దీపికపదుకొనే ఆస్కార్ రెడ్‌కార్పెట్‌కు వెళ్లడం లేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఎబిసి సంస్థ ప్రసారం చేస్తున్నది.

English summary
Oscar is worth much more than the metals that go into it. The only price it'll pay for an Oscar is a measly $10.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu