»   » అత్యద్భుతం ఈ సరికొత్త 3డి మాయాజాలం

అత్యద్భుతం ఈ సరికొత్త 3డి మాయాజాలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవతార్ సృష్టించిన 3డి మాయాజాలం హాలీవుడ్ మీద పెను ప్రభావాన్నే చూపింది. అవతార్ సూపర్ హిట్ అవడంతో పాటు ఆపైన అలైస్ ఇన్ వండర్ ల్యాండ్ అనే 3డి సినిమా కూడా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో మరో 3డి సినిమా విడుదలకు ఆజ్యం పోసాయి. కానీ ఈ సారి వస్తున్నది యానిమేషన్ 3డి సినిమా. హౌటు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే పేరుతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రష్యా, ఉత్తర అమెరికా, ఫిలిప్పీన్, ఇండోనేషియా వంటి దేశాల్లో విడుదలయింది. విడుదలయిన ప్రతీ చోటా సూపర్ టాక్ తెచ్చుకొని ప్రింట్లను పెంచుకుంటూపోతోంది.

ఇక ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఐమాక్స్ వెర్షన్ తో విడుదలయింది. మొదటి ఆట చూసిన వారందరూ ఈ యానిమేషన్ 3డి సినిమాను చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యారట. ఇక ఈ సినిమా ఓ బాలడు డ్రాగన్ తో కలసి చేసిన సాహసాల సమాహాం. 2003వ సంవత్సరంలో వచ్చిన హౌటు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu