»   » అపరాదానికి బహిష్కరించబడి... తగిన మూల్యం చెల్లించాడు

అపరాదానికి బహిష్కరించబడి... తగిన మూల్యం చెల్లించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డుల కఠిన నిబంధనలకు ఈ సంఘటన దర్పం పడుతోంది. అస్కార్ అవార్డుల్లో జేమ్స్ కామెరూన్ సైంటిఫిక్ సినిమా అవతార్ కు ప్రధాన పోటీదారు అయిన ది హర్ట్ లాకర్ సినిమా నిర్మాత నికోలస్ చార్టయిర్ ఆస్కార్ వేడుకల నుండీ బహిష్కరణకు గురయ్యారు. దీనికి కారణం ఆయన ఆస్కార్ ఓటర్లకు అవతార్ సినిమాకు కాకుండా తమ సినిమాకు ఓట్ చెయ్యమని ఈ-మెయిల్ చెయ్యడమే. దీంతో ఆయన పోటీదారు సినిమాకు విరుద్దంగా ప్రచారం చేసినట్టు అయింది.

సదురు ఈ-మెయిల్ లో ఆయన "దయుంచి మా సినిమా హర్ట్ లాకర్ కు ఓట్ చెయ్యండి, కానీ ఆ 500 మిలియన్ డాలర్లతో రూపొందిన సినిమా(అవతార్)కు వెయ్యకండని" మనవి చేసాడంట. ఈ మెయిల్ పంపించిన వెంటనే తప్పును గ్రహించిన ఆయన వెంటనే క్షమాపనలు చెబుతూ మరో మెయిల్ పంపినా ఆస్కార్ నిబంధనల ప్రకారం ఆయనకు ఆస్కార్ వేడుకలకు హాజరయ్యే అర్హత లేదని చెప్పి బహిష్కరించారు. దీంతో ఇప్పుడాయన చేసిన తప్పుకు తీరిగ్గా పశ్చాత్తాపపడుతున్నాడట, ఒక వేళ తన సినిమాకు ఆస్కార్ వస్తే అవార్డును అందుకునే అద్భుతమయిన, అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడినవుతానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu