»   » ఇరాక్ పై యుద్ధమే అవార్డులు తెచ్చిపెడుతున్నాయి

ఇరాక్ పై యుద్ధమే అవార్డులు తెచ్చిపెడుతున్నాయి

Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమా విడుదలయినపుడు ఈ సినిమా ప్రపంచ రికార్డులన్నిటినీ బద్దలుకొడుతుందని అందరూ ఊహించారు. ఇక అవార్డుల్లో కూడా ఈ సినిమాకు పెద్దగా పోటీ ఏమీ వుండదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. అవతార్ సినిమాకు ఏ అవార్డు రానీకుండా అడ్డుపడుతోంది ఆయన మాజీ భార్య క్యాథరీన్ బిగిలోవ్. ఆమె దర్శకత్వం వహించిన ది హర్ట్ లాకర్స్ సినిమా విడుదలయి ఆశించినంత విజయం సాధించలేదు, కానీ అవార్డుల విషయంలో మాత్రం అన్ని సినిమాలనూ అధికమించి రికార్డు స్థాయిలో అవార్డులను రాబడుతోంది.

ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 9 నామినేషన్లు పొందిన ఆస్కార్ లో నామినేషన్ పొందిన అత్యల్ప వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా, అమెరికన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డుతో పాటు, ఎడిటర్స్ గిల్డ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ అవార్డుల్లో ఈ సినిమా అవతార్, డిస్ట్రిక్ 9 వంటి ఆస్కార్ అవార్డుల రేస్ లో వున్న సినిమాలతో పోటీపడి విజయం సాధింటడంతో ఈ సినిమాకే ఆస్కార్ అవార్డుల పంట పండనుందనే అంచనాలు వున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu