»   » ఆ సమస్య వల్ల నా జుట్టు రాలడం మొదలైంది....!

ఆ సమస్య వల్ల నా జుట్టు రాలడం మొదలైంది....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన అందాల సుందరి 'ఎలిన్ నోర్డె గ్రెన్'. ఈమె గోల్ప్ స్టార్ ఆటగాడు' టైగర్ వుడ్స్' మాజీ భార్య. ఇటీవల కాలంలో టైగర్ వుడ్స్ తో విఫలమైన వైవాహిక బంధంపై ఎలిన్ నోర్డె గ్రెన్ మొదటిసారి పెదవి విప్పారు. టైగర్ వివాహేతర సంబంధాలు విని దిగ్ర్భాంతి చెందానని, అవన్ని నమ్మలేక పోయానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను వెల్లడించింది.

విడాకులు తీసుకోవడానికి ముందు ఎప్పుడు లేని విధంగా తన జుట్టు రాలడం మొదలైందని అన్నారు. టైగర్ వుడ్స్ తనకి చాలా నమ్మకద్రోహం చేశాడని తన మనోభావాలను వెల్లడించారు. అతనని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుందని అందుకే తన నుండి విడాకులు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ విడాకులు తీసుకున్నందుకుగాను 'ఎలిన్ నోర్డె గ్రెన్ కు టైగర్ వుడ్స్' రూ 464 కోట్లు చెల్లించడం జరిగినది. దీనిని బట్టి మనకి ఏమి అర్దం అవుతుందంటే విడాకులు తీసుకోవడంలో కూడా టైగర్ వుడ్స్ తన రాజసాన్ని చూపించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu