»   » ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు అమానుషం: అవతారుడు

ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు అమానుషం: అవతారుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరో అయిపోయిన నటుడు శ్యామ్ వర్తింగ్టన్. ఈ సినిమా తీసుకువచ్చిన క్రేజ్ తో ఆయన చాలా సంతోషంగా వున్నాడు. ప్రస్తుతం క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్న ఆయన తీరిక చేసుకుని మీడియాతో ముచ్చటించాడు.

నా జీవితాన్ని అవతార్ సినిమాకు ముందు, అవతార్ తర్వాత అని చెప్పవచ్చు. అవతార్ సినిమాకు సైన్ చేసే ముందు నేను తీవ్ర ఆర్థిక సంక్షభంలో వున్నాను. ఎంత అంటే వుండటానికి ఇళ్లు లేక కారులోనే నివసించేంత దుర్భరంగా వుండేది నా జీవితం. కానీ నేను ఏ నాడూ నిరాశపడకుండా కష్టంగా కాకుండా ఇష్టంగా జీవించాను. కానీ అవతార్ సినిమా తర్వాత నాకు కారులో బ్రతకాల్సిన అవసరం లేకపోయింది. దీనికి జేమ్స్ కామెరూన్ గారికి నేనెప్పుడూ రుణపడి వుంటాను అని వ్యాఖ్యానించారు. మరి మొన్న కామెరూన్ ఇండియా వచ్చినప్పుడు నేనూ రావాల్సి వుంది. కానీ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమా ప్రమోషన్ లో బిజీగా వుండటం వల్ల రాలేకపోయాను. కానీ భారతీయులు సినిమాను ఎంతగా ప్రేమిస్తారో కామెరూన్ చెప్పారు. వారికి సదా నేను కృతజ్ఞడను అని చెప్పాడు.

మరి అవతార్ లో మీకు స్టార్ ఇమేజి వచ్చింది కదా అని అడగబోతే నేను ఇప్పుడు కూడా నా కారులో నివసించడానికి సిద్ధంగా వున్నాను. జీవితంలో అన్నీ మనమనుకున్నట్టుగానే జరగాలంటే అత్యాశే అవుతుంది. ఏది ఎలా జరిగిన మనం జీవించడం ఆపేయలేము కదా అంటూ ఫిలాసఫీ బోధించాడు. మరి మీరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కదా... అక్కడ భారతీయుల మీద జరుగుతున్న దాడుల గురించి మీరేమంటారు అనే ప్రశ్నకు ఎవరూ ఎవరినీ నొప్పించకుండా అందరికీ ప్రేమను పంచుతూ జీవించమని చెబుతాను. అయినా ప్రతీ దేశంలోనూ ఇలాంటివి సాధారణమే కానీ ఇలాంటివి జరగకపోతే మంచిది అని అభిప్రాయపడ్డారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu