»   » నాపై రేప్ జరిగాక పూర్తిగా మారిపోయానంటున్న స్టార్ సింగర్

నాపై రేప్ జరిగాక పూర్తిగా మారిపోయానంటున్న స్టార్ సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: పాప్ సెన్నేషన్ లేడీ గాగా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తనపై 19వ ఏటనే రేప్ జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దాదాపు ఏడేళ్ల వరకు ఎవరికీ చెప్పలేదని కూడా ఆమె తెలిపారు. ఆ భయంకరమైన సంఘటన నుండి తేరుకోవడానికి ఎమోషన్ థెరపీ తీసుకున్నానని లేడీ గాగా చెప్పుకొచ్చారు.

హోవర్డ్ స్టెర్న్ షోలో ఇంటర్య్వూలో పాల్గొన్న 29 ఏళ్ల లేడీ గాగా ఈ విషయం వెల్లడించారు. ‘19 ఏళ్ల వయసున్నపుడు నాపై రేప్ జరిగింది. నాకంటే 20 ఏళ్లు పెద్దవాడైన ఓ వ్యక్తి నాపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన వల్ల కలిగిన షాక్ నుండి తేరుకోవడానికి ఎమోషన్ థెరపీ, మెంటల్ థెరపీ, ఫిజికల్ థెరపీ కూడా తీసుకున్నాను. ఆ సమయంలో నేను కాథలిక్ స్కూల్ లో చదువుకుంటున్నాను' అని లేడీగాగా తెలిపారు.

I changed myself completely after rape: Lady Gaga

ఆ విషయాన్ని ఎలా మరిచిపోవాలో, ఎలా జీర్ణించుకోవాలో అప్పట్లో అర్థం కాలేదు. ఆ సంఘటన తర్వాత నేను చాలా మారిపోయాను. ఆ పీడకలను మరిచిపోయి మనోస్తైర్యంతో కెరీర్ మీద దృష్టి సారించాను అని లేడీ గాగా వెల్లడించారు.

రేప్ ఘటనలపై లేడీ గాగా వీడియో

లేడీ గాగా గురించిన విషయాల్లోకి వెళితే...ఇంటర్నేషనల్ పాప్ సంగీత ప్రపంచంలో లేడీ గాగా ఓ సంచలనం. అందరిలా కాకుండా.... ఇతరులకు పూర్తి భిన్నంగా, తనకంటూ ప్యతేకంగా, అవసరం అయితే అగ్లీ అవతారాల్లో సైతం కనిపించడం లేడీ గాగా ప్రత్యేకత. స్టేజీ షోలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆమె వేషధారణ, దుస్తువులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఆమెను పాపులర్ స్టార్‌ను చేసాయి. ఆమె వేషధారణ ఎంత డిఫరెంటుగా ఉంటుందో...ఆమె ఆల్బమ్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

English summary
Pop sensation Lady Gaga has opened about being raped at 19 and how the traumatic experience changed her life. The singer first revealed she had been raped as a teenager during an interview last year, reported Contactmusic.
Please Wait while comments are loading...