»   » అలా ఏడుస్తూ ఉండిపోయాను: డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్

అలా ఏడుస్తూ ఉండిపోయాను: డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ రెజ్లర్, హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్(ది రాక్) చాలా కాలంగా తాను డిప్రెషన్‌తో రహస్యంగా యుద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసిన ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించిన తన తల్లిని కాపాడుకున్నట్లు, ఆ సంఘటనతో చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపారు.

స్ట్రగుల్ మరియు పెయిన్ అనేది నిజం. ఒకానొక సమయంలో దాని వల్ల నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. అది ఎక్కువయ్యే సరికి నేను ఏ పని చేయడానికి, ఎక్కడికీ వెళ్లడానికి ఇష్టం ఉండేది కాదు. అలా ఏడుస్తూ ఉండిపోయాను' అని డ్వేన్ జాన్సన్ వెల్లడించారు.

నేను ఒత్తిడితో పోరాడుతున్నాను అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు డ్వేన్ జాన్సన్ సమాధానం ఇస్తూ... 'నేను కూడా డిప్రెషన్‌తో చాలా సార్లు యుద్ధం చేశాను' అని తెలిపారు. నేను 15 ఏళ్ల వయసులో ఉన్నపుడు నా తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్నేహితులు, ఫ్యామిలీ ఆత్మహత్యలకు సంబంధించిన ప్రభావం మనలో చాలా మందిపై ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి అని డ్వేన్ జాన్సన్ వెల్లడించారు.

డ్వేన్ జాన్సన్ సినిమాల విషయానికొస్తే.... ఆయన నటించిన 'జుమాంజి' చిత్రం 2017లో విడుదలై ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన 5వ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం జాన్సన్ 'రాంపేజ్', 'స్కై స్కాపర్', 'పైటింగ్ విత్ మై ఫ్యామిలీ' చిత్రాల్లో నటిస్తున్నారు.

English summary
Wrestler turned actor Dwayne Johnson (aka The Rock) talked about his secret battle with depression in an interview with The Express one month after he recalled on Instagram how he had saved his mother from a suicide attempt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X