»   » 14 ఏండ్ల వయసులో రేప్ జరిగింది.. నేను బాధితురాలినే..

14 ఏండ్ల వయసులో రేప్ జరిగింది.. నేను బాధితురాలినే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'7 ఏండ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను. 14 ఏండ్ల వయసులో నాపై రేప్ జరిగింది. ఆ ఘటన 1998లో జరిగింది. అక్రమ మానవ రవాణకు గురికాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం' అని ప్రముఖ హాలీవుడ్ నటి ఆష్లే జడ్ తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 'వరల్డ్ కాంగ్రెస్ అగెనెస్ట్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్ ఆఫ్ ఉమన్ అండ్ గర్ల్స్' అనే సదస్సుకు మంగళవారం ఆమె హాజరయ్యారు.

 Ashley Judd

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆష్లే మాట్లాడుతూ ఏదో కారణంతో వ్యభిచారంలో కూరుకుపోయి మహిళలు, బాలికలపై వివక్ష చూపవద్దని వేడుకొన్నారు. లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తాను కూడా లైంగిక దాడి బాధితురాలినేనని వెల్లడించారు.

చేతులకు గోరింటాకు పెట్టుకొని ఆమె కార్యక్రమానికి హాజరై ఆకట్టుకొన్నారు. ఐదు నిమిషాలపాటు హిందీలో ప్రసంగించారు.

English summary
Ashley Judd too has been a victim of sexual harassment. she said I was molested when I was 7 years old. I was raped at 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu