»   » టాప్ 5: అత్యథిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలు(ఫొటో ఫీచర్)

టాప్ 5: అత్యథిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలు(ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : మన తెలుగు చిత్రాలకు కలెక్షన్స్ కుంభవృష్టి అనే పదం వాడేస్తూంటాం కానీ ఈ క్రింద కలెక్షన్స్ చూస్తే ఏం పదం వాడాలో అర్దం కాదు. ఎందుకంటే వేల కోట్లు కలెక్టు చేసి షాక్ ఇస్తూంటాయి.

అఫ్ కోర్స్ మనం మాట్లాడుకునేది హాలీవుడ్ గురించే, అక్కడ బడ్జెట్లు కూడా అదే రేంజిలో ఉంటాయనుకోండి. అయినా అక్కడ కూడా రిలీజైన అన్ని చిత్రాలు కలెక్షన్స్ జడివాన కురిపించవు. అన్ని సరిగ్గా ఉంటేనే ప్రేక్షకాదరణ పొందుతాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కొన్ని హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నాయి. దశాబ్దాల సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలయ్యాయి. ఆ సినిమాలు ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం...

స్లైడ్ షోలో ఆ సినిమాల వివరాలు..

అవతార్(2009)

అవతార్(2009)

ఇండియాలోనూ ఈ సినిమా ఇరగతీసి ఆడింది. తెలుగులో డబ్బింగై మరీ కలెక్షన్స్ కురిపించింది. సైన్స్‌ఫిక్షన్ అవతార్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా. ఈ సినిమా వసూళ్ల మొత్తం మన రూపాయి ల్లో చెప్పాలంటే దాదాపు 4,500 కోట్లు. పాత రికార్డులను తుడిచిపెట్టేస్తూ ఇది ఈ మొత్తంతో కొత్త రికార్డును సృష్టించింది. దర్శకుడు జేమ్స్ కామెరున్. విశేషం ఏమిటంటే ఈ సినిమా కన్నా ముందు అత్యధిక స్థాయి వసూళ్లు చేసిన సినిమాల్లో తొలి స్థానంలో ఉన్న టైటానిక్‌ను కూడా కామెరూనే రూపొందించాడు.

టైటానిక్ (1997)

టైటానిక్ (1997)

ఇక ఈ సినిమా గురించి ఇంట్రడక్షన్ ..ఇండియాలో ఉన్న పల్లెజనానికి కూడా చెప్పక్కర్లేదు. 1997 లో రిలీజైన టైటానిక్ ఓ అద్బుతం అని ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో ఒప్పుకుంది. టైటానిక్ షిప్ ప్రమాదానికి కాల్పనికతను జోడించి జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సినిమా 65,86,72,302 డాలర్ల సొమ్మును వసూలు చేసింది. లియొనార్డో డికాప్రియో, కేట్‌విన్‌సేట్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వసూళ్ల స్థాయి రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 4,000 కోట్లు.

ది అవేంజర్స్(2012)

ది అవేంజర్స్(2012)

ఈ సినిమా వస్తూనే థియేటర్లను కళకలాడించింది. ఈ సినిమాకు దాదాపు 62,32,79,547డాలర్ల డబ్బు వచ్చింది. ఆ మొత్తాన్ని భారతీయ మారకంలో చెప్పాలంటే మూడువేల ఎనిమిదివందల కోట్ల రూపాయలు. ఎన్నో యేళ్లుగా ఉన్నరికార్డులను తుడిచేస్తూ అత్యధిక స్థాయి వసూళ్లను సాధించిన వాటిల్లో మూడో స్థానంలో నిలిచిన సినిమా ‘ది అవేంజర్స్'.

ది డార్క్‌నైట్ (2008)

ది డార్క్‌నైట్ (2008)

టెక్నకల్ గా అద్బుతమైన స్ధాయిలో ఉన్న ఈ చిత్రం చూడటానికి జనం ఎగబడ్డారు. తెలిసిన కథే అయినా జనం అధ్బుతంగా ఉందని నీరాజనాలు పట్టారు. ఈ బ్రిటిష్-అమెరికన్ సూపర్‌హీరో సినిమాకు 53,31,60,671కోట్ల డాలర్లు కలెక్షన్లుగా వచ్చాయి. 2005లో విడుదల అయిన‘బ్యాట్‌మన్ బిగిన్స్'కు సీక్వెల్‌గా వచ్చింది ఈ సినిమా. దాదాపు మూడు వేల రెండువందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

 స్టార్‌వార్స్-1(1999)

స్టార్‌వార్స్-1(1999)

ఒకానొకటైమ్ లో ఈ సినిమా చూడటం అనేది ప్రస్టేజి ఇష్యూ. ఆ సినిమా చూడలేదా అంటే వింతగా చూసారు. హాలీవుడ్‌లో స్థాయిని రెండు వేల కోట్ల రూపాయలకు చేర్చిన రెండో సినిమా ఇది. ఒక దశలో టైటానిక్ తర్వాతి స్థానంలో ఉండేది.ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది. 47,45,44,677డాలర్ల వసూళ్లను సాధించిన ఈ సినిమా రేంజ్‌ను రూపాయల్లో చెప్పాలంటే రెండు వేల కోట్ల రూపాయలు.

English summary
The 5 films that have grossed the most worldwide are about wizards or superheroes or other wonderful weirdos, with the exception of Titanic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu