twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆస్కార్‌’ ...మరో మనోడికి

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : ‘ఆస్కార్‌' పురస్కారం మరో భారత సంతతి వ్యక్తిని వరించింది. ఇటీవలే టెక్నికల్‌ అచీవ్‌మెంట్‌ విభాగంలో భారత సంతతికి చెందిన రాహుల్‌ థక్కర్‌ ఆస్కార్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ మూలాలున్న మరో వ్యక్తికీ ఆస్కార్‌ దక్కిందని తెలిసింది.

     Indian-Origin Technician Cottalango Leon Wins Oscar

    44 ఏళ్ల కొట్టలాంగో లియోన్‌ ఈ ఏడాది సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ అఛీవ్‌మెంట్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు పొందారు. సోనీ పిక్చర్స్‌ ఇమేజ్‌ వర్క్స్‌లో డిజైన్‌, ఇంజినీరింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరించినందుకు గాను లియోన్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

    So while I was going about my normal day yesterday, this oscar news was a definitely a jolt to my system. Now that I...

    Posted by Cottalango Leon on 9 January 2016

    తమిళనాడులోని ట్యూటికోరిన్‌ జిల్లాలో జన్మించిన లియోన్‌ కోయంబత్తూర్‌లో పెరిగారు. 1994లో అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్‌ వార్షిక సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ అవార్డుల ప్రదానోత్సవంలో లియోన్‌ పురస్కారం అందుకోనున్నారు.

     Indian-Origin Technician Cottalango Leon Wins Oscar

    ప్రధాన విభాగాల ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవం ఫిబ్రవరి 28న జరగనుండగా.. దానికన్నా ముందే ఫిబ్రవరి 13న సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ విభాగాలకు సంబంధించిన 10 ఆస్కార్‌ పురస్కారాలను అందజేయనున్నారు.

    English summary
    The 44-year-old technician of Indian roots Cottalango Leon has been chosen for this year's Oscar for scientific and technical achievement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X