Just In
- 25 min ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 49 min ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 11 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 11 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
Don't Miss!
- Finance
నిర్మలమ్మ 2022 మార్చి వరకు పొడిగించాలి, బడ్జెట్లో ఇలా చేయాలి..!
- News
మొన్న అమెరికా.. నేడు రష్యా: ఒక్కడి కోసం లక్షలాదిమంది: దాడులు..ఘర్షణలు: ఏం జరుగుతోంది?
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ బహిష్కరిస్తున్నారు
లాస్ ఏంజిల్స్: ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులను ఇరాన్ దేశం బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ముస్లాంకు వ్యతిరేకంగా 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం' అనే చిత్రం రూపొందించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ సారి ఆదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంట్రీలు పంపలేదు.
ఆదేశం తరుపున 'ఎ క్యూబ్ ఆఫ్ షుగర్' అనే చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీకి పంపుదామని అనుకున్నారు. కానీ యాంటీ ఇస్లాం సినిమా నేపథ్యంలో ఆ దేశంలోని సినిమా రంగం అంతా ఏకమై ఆస్కార్ అవార్డులను బహిష్కరించడం ద్వారా నిరసన తెలుపాలని నిర్ణయించారు.
వివాదాస్పద ఇస్లాం వ్యతిరేక చిత్రం 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం'పై ప్రపంచంలోని ఇస్లాం లోకం మొత్తం భగ్గమంటున్న సంగతి తెలిసిందే. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఒక అమెరికన్ తయారు చేసిన వివాదాస్పద చిత్రం అమెరికా సర్కారుకు ఇరకాటంగా మారింది. ఈచిత్రంలో నటించిన వారు ఇప్పుడు అర చేతితలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ కాన్సులేట్లపై దాడులు కారణమైన చిత్రానికి దర్శకత్వం వహించిన అమెరికన్ దర్శకుడు శ్యాం బేసిల్ ప్రస్తుతం అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవలే ఆయన్ను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయినా తాను ముస్లిం వ్యతిరేక చిత్రాలు తీయడం ఆపనని ఆ దర్శకుడు చెబుతుండటం గమనార్హం.
ఇక మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కి రణబీర్ కపూర్, ఇలియానా, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన 'బర్ఫీ' చిత్రం ఎంపికైన విషయం తెలిసిందే. విభిన్న తరహా ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహించారు.