»   » కేక కదా: 'జురాసిక్‌ వరల్డ్‌' పోస్టర్ పై మనోడు... (ఫొటో)

కేక కదా: 'జురాసిక్‌ వరల్డ్‌' పోస్టర్ పై మనోడు... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ : స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. డైనోసార్ల గురించి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు 'జురాసిక్‌ వరల్డ్‌' పేరుతో మరో కొత్త సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా పోస్టర్ పై ఇర్ఫాన్ ఖాన్ ని వేసి పబ్లిసిటీ ప్రారంభించారు. ఇక్కడ మీరు దాన్ని చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రతిష్ఠాత్మక 'జురాసిక్‌ పార్క్‌' సిరీస్‌లో భాగంగా వస్తోన్న నాలుగో చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌'. క్రిష్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌యజమాని సైమన్‌ మస్రానీ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు ఇర్ఫాన్‌.

Irrfan Khan Features on Jurassic World Poster With Chris Pratt

ఈ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టాడు ఇర్ఫాన్‌ ఖాన్‌. జురాసిక్‌ పార్క్‌ను ప్రేక్షకుల సందర్శన కోసం తిరిగి ప్రారంభించడానికి యాజమాన్యం కృత్రిమంగా డైనోసర్‌ను సృష్టిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ జీవి వారి అధీనం నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే పరిణామాల మాలిక ఈ చిత్రం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క ఈ సినిమాను వైవిధ్యమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈ తాజా చిత్రం కోసం 7 రకాల కొత్త తరహా డైనోసార్‌లను రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన నమూనాలను సైంటిస్టులు తయారు చేసిన విధానాన్ని జురాసిక్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోల రూపంలో సినిమా అభిమానులకు అందిస్తున్నారు.

Irrfan Khan Features on Jurassic World Poster With Chris Pratt

డైనోసార్లు మళ్లీ పుట్టాయేమో అన్నంత సహజంగా ఉన్న ఆ జీవులను చూసి వీక్షకులు ఆశ్చర్యపోతున్నారట. జురాసిక్‌ పార్క్‌ సందర్శకులకు ఈ కొత్త జీవులను చూసే అవకాశం కల్పించడం విశేషం.

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 12, 2015న ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది.

English summary
In Jurassic World, Irrfan plays the role of Simon Masrani, CEO of the Masrani Corporation and the owner of the Jurassic World.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu