twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రోజెన్: అతీంద్రియ శక్తుల కథనా? పురాణగాథనా?

    |

    ఫ్రోజెన్ చిత్రం ఊహా జనితమైన కథనా లేకా పురాణ కథనా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఫ్రోజెన్‌ చిత్రాన్ని ఈ రెండు అంశాలను మేలవించి చిత్ర నిర్మాతలు రూపొందించారు. ఈ చిత్రం పురాణ గాథతో కూడిన సాహసయాత్రగా తెరకెక్కించారు. ఈ సినిమా గురించి అసలు విషయం ఏమిటనే విషయాన్ని ఈ చిత్రంలోని రెండు ప్రధాన పాత్రలు సిస్టర్ అన్నా, సిస్టర్ ఎల్సా గురించి తెలుసుకోవాల్సిందే.

    సిస్టర్ అన్నా విషయానికి వస్తే ఎలాంటి అనుమానం లేకుండా ఊహజనితమైన పాత్రనే. ఆమె పూర్తిగా ఆశావాది. ఈ పాత్ర గురించి డైరెక్టర్, రచయిత జెన్నీఫర్ మాట్లాడుతూ.. మంత్రశక్తులతో కాకుండా మానవ రూపంలో ఉండే పాత్రలా కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి డేంజరెస్‌గా ఉండే మ్యాజికల్ వరల్డ్‌లోకి ప్రవేశిస్తుంది. అనేక సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొని విజేతగా నిలుస్తుంది అని అన్నారు.

    సిస్టర్ అన్నా క్యారెక్టర్‌కు పురాణ అంశాల నేపథ్యం ఉంటుంది. ఈ పాత్ర గురించి జెన్నీఫర్ లీ మాట్లాడుతూ.. పురాణ నేపథ్య ఉన్న పాత్రలకు మంత్రశక్తులు ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ మనం ఎదుర్కొనే ప్రశ్నలకు అసలు సిసలైన సమాధానంగా నిలుస్తుంది. ఈ పాత్రలో విషాద కోణం కూడా ఉంటుంది. ఆ పాత్ర నుంచి మనం కొన్ని నేర్చుకొనే అవకాశం ఉంటుంది.

    Is Frozen 2 sequel a fairytale or is it a mythology?

    ఎల్సాకు కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ.. చివరకు మంత్ర శక్తులను సొంతం చేసుకొంటుంది. కానీ వాటిని పరిమితంగా ఉపయోగించుకొంటుంది. ఓ మంచి రాణిగా మెప్పు పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. అలా తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సామ్రాజ్యంలో తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇక ఎల్సాను అన్నా కాపాడుకొంటూ ఓ రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ఒంటరిననే భావన కలిగించకుండా ఎల్లవేళలా తోడుగా ఉంటుంది.

    తాను అత్యంత ప్రేమగా చూసుకొనే సోదరితో అన్నా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రపంచాన్ని తన భుజాలపై మోసే సోదరిని కంటికి రెప్పలా కాపాడుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. పురాణ నేపథ్యంగా ఉండే క్యారెక్టర్లలో కొంత విషాదం కనిపిస్తుంటుంది. ఈ సీక్వెల్‌లో ఎల్సాను ఎలాంటి ప్రమాదానికి లోనుకాకుండా అన్నా ఎప్పుడు వెన్నంటి ఉంటుంది.

    English summary
    Is Frozen a fairytale or is it a mythology? The makers of Frozen realised that unknowingly they had both a fairytale and mythology running together in the first film. But, what's the difference? You will be informed when you study the 2 lead characters - sisters Anna and Elsa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X