»   » సినిమా బిజినెస్‌లోకి దిగుతున్న ఒకప్పటి మోడల్

సినిమా బిజినెస్‌లోకి దిగుతున్న ఒకప్పటి మోడల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిరందా కెర్ మోడల్ రంగంలో రాణించే వారు ఈ పేరు వినిఉండరు అంటే నమ్మ శక్యం కాదు. హాలీవుడ్‌లోకి విక్టోరియా సీక్రెట్ ద్వారా అనతి కాలంలోనే అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌‌గా పేరే ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఆ తర్వాత అదే విక్టోరియా సీక్రెట్ కార్యక్రమంలో హీరో అయినటువంటి ఆర్నాల్డ్ బ్లూమ్‌ని పెళ్లి చేసుకోని బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఐతే మిరందా కెర్ హాలీవుడ్ మూవీ మొగల్ హార్వే వెయిన్ స్టెయిన్ ఇటీవలే కలవడం జరిగింది.

28 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ మోడల్ సడన్‌గా హాలీవుడ్ మూవీ మొగల్‌ని కలవడం వెనుక ఏమైనా కారణం ఉందా అని ఆలోచిస్తున్నారు. మిరందా కెర్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరలా బిగ్ స్క్రీన్ మీద కనపడడం కోసమే ఇలా మూవీ మొగల్‌ని కలిశారని హాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. మూవీ మొగల్‌ని కలవడం కోసం మిరందా కెర్ గ్రీన్ డ్రస్‌లో బ్లాక్ హై హీల్స్ ధరించి రావడం జరిగింది. దాంతో చాలా కాలం తర్వాత మిరందా కెర్‌ని చూసినటువంటి మూవీ మొగల్ కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. ఐతే ఈ భేటీలో ఆమెకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం విశేషం.

గతంలో వోగ్ ఇటాలియా కవర్ పేజిపై తన అందాలను మిరంద కెర్ ఆరబోయడం జరిగింది. వోగ్ ఇటాలియా అనేది 3డి లో వచ్చినటువంటి మొట్టమొదటి ఫ్యాషన్ మ్యాగజైన్. వోగ్ ఇటాలియా పత్రకకి ఎక్కువ రూమ్స్ తో పాటు, ప్రింటింగ్ సామర్ద్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ ఫోటోషూట్ లో మిరంద కెర్ చాలా అద్బుతంగా ఉంది.

English summary
There’s speculation the Victoria’s Secret model might be looking to follow husband Orlando Bloom onto the big screen after Kerr was spotted with film mogul Harvey Weinstein in New York.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu