»   » మైఖేల్ జాక్సన్ కూతురు బాయ్ ఫ్రెండుతో ఇలా.. (ఫోటో)

మైఖేల్ జాక్సన్ కూతురు బాయ్ ఫ్రెండుతో ఇలా.. (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజిల్స్: దివంగత ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తిగా మారారు. 17 ఏళ్ల పారిస్ జాక్సన్ గత కొంత కాలంగా బాయ్ ఫ్రెండ్‌ చెస్టర్ కాస్టెల్లాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. చెస్టర్ వయసు 18 సంవత్సరాలు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండుతో కలిసి దిగిన ఫోటోలను పారిస్ జాక్సన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తోంది.

చెస్టర్ వల్ల పారిస్ జాక్సన్ గర్భవతి అయినట్లు గతేడాది వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘పారిస్ జాక్సన్ తన బాయ్ ఫ్రెండుతో కలిసి డేట్ కి వెళ్లినపుడు తాము చూసామని, ఆమె బేబీ బంప్ చూస్తుంటే గర్భవతి అయినట్లు స్పష్టమవుతోందని పలువురు వ్యఖ్యానించినట్లు డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. గత కొంతకాలంగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు.

 Is Paris Jackson Boyfriend?

తాజాగా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పారిస్ జాక్సన్ చేతికి ఓ రింగ్ ఉండటమే ఇందుకు కారణం. అయితే రింగ్ ఉన్నంత మాత్రాన ఎంగేజ్మెంట్ అయినట్లా అని కొందరు ఇలాంటి వార్తలపై మండి పడుతున్నారు.

పారిస్ జాక్సన్ విషయానికొస్తే...ఆమె మైఖేల్ జాక్సన్ ఒక్కగానొక్క కూతురు. నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ టీవీ కార్యక్రమాల్లో నటిస్తోంది. హాలీవుడ్లో నటిగా రాణించాలనే లక్ష్యంతో పారిస్ జాక్సన్ ముందుకు సాగుతోంది.స

English summary
Michael Jackson's only daughter sparked engagement rumors on Tuesday, when she was spotted wearing a silver ring on her ring finger as she sipped on a sweet Starbucks beverage in Los Angeles. For the Starbucks run, Paris donned a Bob Marley tank top, black sweats, matching Ugg boots and of course all those rings!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu