»   » జేమ్స్ కామెరూన్ సినిమాని కాపీ కోట్టిన ఆ దర్శకుడు ఎవరూ..?

జేమ్స్ కామెరూన్ సినిమాని కాపీ కోట్టిన ఆ దర్శకుడు ఎవరూ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమాని మన ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఎన్ని అద్బుతాలు సృష్టించిందో చెప్పనక్కరలేదు. 1981లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపోందించిన 'పిరానా 2' చిత్రాన్ని ఆధారంగా తీసుకొని 'అలెగ్జాండర్ ఆజా' దర్శకత్వంలో డైమెన్షన్ ఫిలింస్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం 'పిరానా 3డి'. అత్యాధునిక సాంకేతిక విలువలుతో రూపోందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న లేదా వచ్చే నెల 2న ఇండియాలో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది అని, సినిమా సస్పన్స్ మరియు హర్రర్ తో కూడుకోని వుంటుందని ఈ చిత్రం నైజాం ఏరియాకు హక్కులు పోందిన శోభారాణి చెప్పారు. ఇక కధ విషయానికి వస్తే 'విక్టోరియా లేక్'లో మనుషులను తినే భయంకరమైన చేపలు సృష్టించిన భీభత్సమే 'పిరానా3డి'కధాంశం. ఇటీవల కాలంలో అనువాద చిత్రాలకు మంచి స్పందన లభించడంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించడం జరిగినది. ఈ సినిమా లో ఎలిజిబెత్ షా,ఆడమ్ స్కాట్ హిరో, హిరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా 'అవతార్','యుగాంతం'మాదిరే మంచి రికార్డులను నమోదు చెయ్యాలని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu