16 ఏళ్లు డేటింగ్.. పెళ్లి తర్వాత 30 రోజులకే విడాకులు.. స్టార్ హీరోను 1420 కోట్ల భరణాన్ని కోరిన భార్య!

సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అప్పటి వరకు పాలు నీళ్లలా కలిసిపోయిన ప్రేమికులు, దంపతులు ఉన్నట్టుంది ఎవరికి వారే విడిపోయి సంచలనం సృష్టిస్తున్నారు. విడాకుల ప్రకటన రావడానికి ముందు కూడా తమను ఎవరూ కూడా విడదీయలేరు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనే విధంగా మీడియా ముందు నాటకం ఆడుతూ నిజ జీవితంలో కూడా మమ్మల్ని మించిన నటులు ఎవరూ లేరని రుజువు చేస్తారు.

అయితే సినిమా ప్రపంచంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకొన్న హీరో ప్రేమ కథ వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. దాదాపు 16 ఏళ్లు ప్రేమించుకొన్నారు. మధ్యలో పోట్లాడుకొన్నారు. గొడవ పడ్డారు. ఆ తర్వాత రాజీ పడ్డారు. మళ్లీ కలిసిపోయారు. ఇలా ఇన్నీ జరిగినా పెళ్లి చేసుకొని పట్టుమని నెల రోజులు కాకుండానే దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పారు. అయితే తన భర్త నుంచి విడాకుల సమయంలో భార్య కోరిన భరణం వింటే నోరు వెళ్లబెట్టాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ స్టార్ హీరో కాంప్లికేటెడ్ లవ్ స్టోరి వివరాల్లోకి వెళితే..

Birdman alimony to Toni Braxton

అమెరికాలోని టాప్ ర్యాపర్లలో ఒకరైన బర్డ్ మ్యాన్ తాజాగా విడాకుల విషయంలో మీడియాలో హైలెట్ అయ్యారు. ఆయన అసలు పేరు బ్రయన్ క్రిస్టఫర్ విలియమ్స్. ఆయన అసలు పేరు కంటే.. స్టేజ్ నేమ్‌తోనే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. అయితే ర్యాపర్‌గా తన ఫీల్డ్‌లో సూపర్బ్‌గా రాణిస్తున్న సమయంలోనే ఆయన అమెరికన్ సింగర్, పాటల రచయిత, నటి, టెలివిజన్ సెలబ్రిటీ టోని మైఖేల్ బ్రాక్ట్సన్‌తో ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే ఆమెకు కేరీ లెవీస్‌ను 2001లో వివాహం చేసుకొని 2013 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు.

బర్డ్ మ్యాన్, బ్రక్ట్సన్ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నప్పటికీ.. 2016లో వారిద్దరూ తమ డేటింగ్ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె అరుదైన వ్యాధికి గురైన సమయంలో కూడా అండగా నిలిచాడు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే వారిద్దరూ ఏడాదిపాటు విడిపోయారు. ఆతర్వాత రాజీ పడి 2019లో మళ్లీ కలిసిపోయారు.

అయితే 2023 సంవత్సరం డిసెంబర్‌లో హాలీవుడ్ మీడియాలో ఇద్దరి పెళ్లి అంటూ జోరుగా వార్తలు షికారు చేశాయి. అయితే తన పెళ్లి వార్తపై బ్రక్ట్సన్ వెంటనే స్పందించి.. అలాంటిదేమీ లేదు. బర్డ్ మ్యాన్‌తో నా పెళ్లి జరగడం లేదు అని వివరణ ఇచ్చింది. అయితే వారిద్దరూ ఆ సమయంలో విడివిడిగానే ఎవరికి వారు లైఫ్ లీడ్ చేశారు. అయితే అనూహ్యంగా 2024 ఆగస్టు 10వ తేదీన తాము విడిపోతున్నాం. మేమిద్దరం విడాకులు తీసుకొంటున్నాం అంటూ బ్రాక్ట్సన్ విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి అప్పటికీ వారిద్దరికి పెళ్లి జరిగి 30 రోజులే అనే విషయం మీడియా, సోషల్ మీడియా కథనాల ద్వారా బయటకు వచ్చింది.

అయితే తాజాగా హలీవుడ్‌లో టుడే విత్ జెన్నా అండ్ ఫ్రెండ్స్ అనే ఇంటర్వ్యూ కార్యక్రమంలో బ్రాక్ట్సన్ మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా మేమిద్దరం ఫ్రెండ్స్. నా షోలకు ఆయన తప్పకుండా హాజరయ్యే వారు. నా సీమంతం ఫంక్షన్‌కు కూడా వచ్చారు. ఆయన నాతో ఎప్పుడూ హద్దు మీర లేదు. ఆ తర్వాత మా మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత మేము 2024 సంవత్సరంలో సీక్రెట్ మ్యారేజ్ చేసుకొన్నాం అని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X