twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ అద్బుత సినిమాలు 'ఎన్సైక్లోపీడియా' రూపంలో..

    By Nageswara Rao
    |

    "హ్యారీ పోటర్" సుప్రసిధ్ద నవలా రచయిత జెకె రౌలింగ్ తన అభిమానులకు "హ్యారీ పోటర్" సిరిస్ మొత్తాన్ని 'ఎన్సైక్లోపీడియా' రూపంలో అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టానని అన్నారు. "హ్యారీ పోటర్" నవలను మొత్తం ఏడు భాగాలుగా సినిమాలు రూపంలో అందించి.. బాక్సాఫీసు రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో నటించిన 'డేనియేల్ రాడ్ క్లిఫ్' ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

    మహిళా రచయిత అయినటువంటి జెక్ రౌలింగ్ తన వెబ్‌సైట్‌లో హార్రీస్ ప్రపంచం మొత్తాన్ని 'ఎన్సైక్లోపీడియా' రూపంలో అందించడానికి సన్నాహాలు మొదలుపెట్టానని.. కాకపోతే అన్ని సిరిస్లను 'ఎన్సైక్లోపీడియా'గా అందించడం కాస్త సమయం తీసుకునే పనిగా అభివర్ణించారు. హ్యారీ సిరిస్ అన్నీ కూడా 'ఎన్సైక్లోపీడియా'కి రాగానే వాటిని ఛారిటీకి విరాళంగా అందించనున్నానని తెలిపారు.

    ఇది ఇలా ఉంటే రౌలింగ్ మరో "హ్యారీ పోటర్" పుస్తకం వ్రాయడానికి తాను సిధ్దంగా లేనని అన్నారు. ఇప్పటి వరకు తాను రచించిన ఏడు హ్యారీ పొట్టర్ సిరిస్ పుస్తకాలను ఏడు ఫ్రాంచైజీ సినిమాలుగా రూపొందించిన విషయం తెలిసిందేనని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బుక్స్ సాధించిన విజయం అంతా ఇంతా కాదు. రౌలింగ్ రచించిన తర్వాతి పుస్తకం “The Casual Vacancy" 2012 సంవత్సరం చివర్లో పబ్లిష్ కానుంది.


    “The Casual Vacancy" పుస్తకంలో ఆసక్తికర అంశాలున్నట్లు సమాచారం. పారిస్‌లో ఉన్న ఓ చిన్న పట్టణం 'ప్యాగ్ ఫోర్డ్' చుట్టూ కథ తిరుగుతుంది.

    English summary
    
 “Harry Potter” author J.K. Rowling is a woman of her words. She had promised fans an encyclopaedia on her popular series, and has now revealed it is already underway.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X