వెయ్యి సార్లు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని ఉందన్న స్టార్ హీరోయిన్
ప్రముఖ అమెరికా పాప్ సింగర్ మరియు హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ తన భర్త మార్క్ ఆంటోనీ ద్వారా 2008లో మాక్స్, ఎమ్మి అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మంగళవారం జరిగినటువంటి ఎలెన్ డిజెనరస్ షోలో జెన్నిఫర్ లోపెజ్ ఓ భయంకరమైన వార్తను బయటపెట్టారు. ఆభయంకరమైన వార్త ఏమిటని అనుకుంటున్నారా..తనకి వెయ్యిసార్లు ప్రగ్నెంట్ తెచ్చుకోవాలని ఆశగా ఉందని అన్నారు.
దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అది మాత్రమే కాకుండా వెయ్యిసార్లు ప్రగ్నెన్సీ అంటే మాటలా అంటూ అందరూ చెవులు కొరుక్కున్నారు. ఈసందర్బంలో జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ నేనేమి తప్పుగా అనలేదే.. నాకు పిల్లలు కావాలి. ఇదంతా నా నిర్ణయం మాత్రమే అని అన్నారు. అందుకే ఎన్ని ఎక్కువ సార్లు ప్రగ్నెన్సీ తెచ్చుకుంటే అంతమంది పిల్లలను కనవచ్చు అనే ఆశతోనే అలా అన్నాను అని అన్నారు.
నాకు మూడు సంవత్సరాలు క్రితం పిల్లలు పుట్టారు. మరలా నాకు పిల్లలను కనాలని ఆశగా ఉంది. అంతేకాకుండా పోషించే శక్తి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలనైనా కనవచ్చు అంటూ తనని తాను సమర్దించుకుంది. అంతేకాకుండా నాసంతానాన్ని వృద్ధి చేసుకోవాలని ఆలోచన ఉంది. మరలా నాకు ప్రగ్నెన్సీ వస్తే నా అంతగా సంతోషించే వారు మరోకరు ఉండరు అని అన్నారు.


Click it and Unblock the Notifications











