twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాకీ చాన్ వందో చిత్రం ‘1911’

    By Bojja Kumar
    |

    హాలీవుడ్ యాక్టర్ జాకీచాన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంటా. జాకీచాన్ చిత్రాలంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా హాస్యాన్ని పండించడం ఆయనకే చెల్లింది. ఆయన నటించిన వందవ చిత్రం '1911' వచ్చే నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వందేళ్లనాటి చరిత్రాత్మక కథనంతో తన వందవ చిత్రాన్ని తెరకెక్కించారు జాకీచాన్. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, హీరో అన్నీ ఆయనే.

    90 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం వందేళ్ల క్రితం అంటే 1911లో జరిగిన ఓ పోరాటగాధ ఆధారంగా తెరకెక్కింది. చైనా రాజు నియంతృత్వ పాలనపై తిరుగుబాటు చేసిన వీరుల యుద్ధగాధ. ఆ పోరాటాన్ని ముందుండి నడిపించే దళపతిగా జాకీచాన్ నటించారు. ఆయన ప్రియురాలిగా ప్రముఖ హాలీవుడ్ నటి బింగ్‌బింగ్ లీ నటించారు. ఇంకా జాకీచాన్ కుమారుడు జాసీచాన్, విన్‌స్టన్ చా తదితరులు కీలకపాత్రలు పోషించారు. 45 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భారతీయ ప్రేక్షకులకి అందిస్తోంది ఇండో ఓవర్‌సీస్ ఫిలిం సంస్థ.

    English summary
    1911, is Jackie Chan’s 100th movie, and it is to be an all-star tribute to the 100th anniversary of the 1911 revolution. The film will tell the story of the founding of the Republic of China, when Sun Yat Sen’s forces overthrew the Qing dynasty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X