పన్నెండు రాశుల చుట్టూ...జాకీఛాన్ చిత్రం
లాస్ ఏంజిల్స్ : జాకీచాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీజెడ్ 12' (చైనీస్ జోడియాక్). ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'ఆర్‌మోర్ అఫ్ గాడ్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మూడవ చిత్రమిది. 12ఏళ్ల తర్వాత జాకీచాన్ నటించి దర్శకత్వం వహించిన భారీ చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన పలు క్రాఫ్ట్‌ల్ని నిర్వహించిన దర్శక, హీరోగా చేసిన జాకీ చాన్ పేరిట గిన్నిస్ రికార్డు నమోదైంది. జ్యోతిషం ప్రకారం మనకున్న పన్నెండు రాశులకు సంబంధించిన ప్రతిమలను సంపాదించడమే ధ్యేయంగా తెరపై హీరో చేసిన సాహసాలు అబ్బురపరుస్తాయి.
ఇక ఈ చిత్రం తెలుగులో 'దొంగలకు దొంగ' పేరుతో అనువాదమైంది. ఈ నెల 28న విడుదలవుతోంది. చిత్ర హక్కులు పొందిన సుబ్రమణ్యం.బి. మాట్లాడుతూ ''జాకీచాన్ సినిమాల్లో యాక్షన్‌తోపాటు వినోదాంశాలకు కూడా ప్రాధాన్యముంటుంది. ఆ తరహాలోనే రూపొందిన చిత్రమిది. ఆయన అత్యంత సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించారు. 'అన్నారు.
అలాగే ' జాగీఛాన్ నటించిన సినిమాలంటే ఇష్టపడని ప్రేక్షకులుండరు. సాహస విన్యాసాలతో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించడంలో జాకీచాన్ తనకు తానే సాటి. ఈ చిత్రంలో ప్రాణాలకు తెగించి డూప్ లేకుండా జాకీచాన్ చేసిన ఫైట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ప్రచారం కోసం తనయుడితో కలిసి జాకీచాన్ పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మా సంస్థ అందించిన గత చిత్రాల స్థాయిలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారు' అన్నారు .
జ్యోతీష్యం ప్రకారం మనకు 12 రాసులు. అలాగే చైనా వారికి కూడా 12 రాసులే. ఈ 12 రాసుల తలలను తసాధించడం కోసం హీరో ఏం చేశాడన్నదే ఈ చిత్రకథ. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆంధ్రవూపదేశ్ అంతటా 125 నుంచి 150 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











