»   » నేను బతికే ఉన్నాను.. : జాకీచాన్

నేను బతికే ఉన్నాను.. : జాకీచాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jackie Chan
న్యూ యార్క్: ''అందరికీ హాయ్.. నేను బతికే ఉన్నానో లేదో తెలుసుకోవడానికి అందరూ ఫోన్లు చేశారు. డెరైక్ట్‌గా అడిగేస్తే బాగుండదని, ఏదేదో వంకలు చెప్పారు. నా మీద వారికున్న అభిమానానికి కదిలిపోయాను. అందరికీ ధాంక్స్'' అన్నారు జాకీచాన్.

ఎవరు పుట్టించారో ఏమో జాకీచాన్ చనిపోయారనే వార్త గుప్పుమంది. ఈ వార్త విన్న జాకీ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళనకు గురయ్యారు. ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవడానికి జాకీచాన్‌కే ఫోన్ కొట్టి అడిగేస్తే పోలా అనుకున్నారు.

అలాగే ''మీకు నమ్మకం కుదురుతుందో లేదో అని లేటెస్ట్‌గా ఫొటో తీయించుకుని, ఫేస్‌బుక్‌లో పెట్టా. నేను బతికే ఉన్నానని ఇప్పటికైనా నమ్ముతారనుకుంటున్నా'' అని నటుడు జాకీచాన్ పేర్కొన్నారు.

తీరా ఫోన్ చేసి, 'మీరు బతికే ఉన్నారా' అనడిగితే బాగుండదు కదా.. అందుకని, ' ఈ మధ్య మీ నిశ్చితార్థం జరిగిందట.. కంగ్రాట్స్' అంటూ ఏవేవో వంకలు వెతుక్కుని మరీ ఫోన్ చేశారట. ఈ ఫోన్‌కాల్స్‌కి సమాధానం చెప్పే బదులు ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి విషయం స్పష్టం చేసేస్తే, సందేహం తీరుతుందని భావించారట జాకీ. అందుకే ఇలా సమాధానమిచ్చాడు.

ఇక వెండి తెరపై కరాటే విన్యాసాలు అనగానే జాకీచాన్‌ గుర్తుకొస్తారు. చైనా యుద్ధ కళలతో జాకీ చేసే పోరాటాలంటే యాక్షన్‌ సినిమా ప్రియులకు చెప్పలేనంత ఇష్టం. జాకీచాన్‌ ఇక పోరాటాలకు స్వస్తి చెప్పేశారు. దీని తరవాత ఇక యాక్షన్‌ చిత్రాలు చేయకూడదని జాకీ నిర్ణయించుకోవటం ఆయన అభిమానలుకు మింగుపడు పడటం లేదు. జాకీ ఛాన్ కు ఇండియాలోనూ ఓ రేంజి అబిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆస్కార్ రవిచంద్రన్ ఆయన్ని ఇక్కడ తన సినిమాలో నటింపచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే కార్యరూపం దాల్చటం లేదు.

English summary
While Jackie Chan was in India to celebrate the Chinese Film Festival, he became the victim of online death hoax. The 59-year-old star took to his Facebook to address the rumours on June 21. "Hi everybody! Yesterday, I got on a 3am flight from India to Beijing. I didn't get a chance to sleep and even had to clean my house when I got home. Today, everybody called to congratulate me on my rumored engagement. Afterward, everybody called me to see if I was alive," Chan wrote.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu