For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజకీయాల్లోకి జాకీ చాన్.. పార్టీలో సభ్యత్వం ఇవ్వండి.. చైనా అధ్యక్షుడికి విన్నపం!

  |

  సినీ రంగం నుంచి నటులు రాజకీయాల్లోకి రావడం ప్రపంచవ్యాప్తంగా కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది వెండితెర మీద పాపులారిటీని సాధించి.. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. కొందరు ముఖ్యమంత్రులుగా, కొందరు దేశాధినేతలుగా ఎన్నికై అద్భుతంగా రాణించారు. ఇప్పటి వరకు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించి విశేషంగా ఆదరణను సంపాదించుకొన్న జాకీ చాన్ త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి, అలాగే జాకీ చాన్ రాజకీయ ప్రవేశం గురించిన వివరాల్లోకి వెళితే..

  శృతి మించిన టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్: ఎద అందాలు చూపిస్తూ రచ్చ.. ప్యాంటును కూడా తీసేసి మరీ!

  సినీ పరిశ్రమ నుంచి పాలిటిక్స్‌లోకి

  సినీ పరిశ్రమ నుంచి పాలిటిక్స్‌లోకి

  గతంలో రొనాల్డ్ రీగన్ నుంచి మొదలుకొని.. అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ అమెరికాలో రాజీకీయాల్లో సత్తా చాటారు. అలాగే దేశంలో చూసుకొంటే ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ కాంత్, శరత్ కుమార్, నెపోలియన్ లాంటి వాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. వారి కోవలో చేరేందుకు జాకీ చాన్ సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

  కుమార్తెను పరిచయం చేసిన హరితేజ.. ఎంత అందంగా ఉందో చూశారా?

  సీపీసీ సదస్సుకు జాకీ చాన్

  సీపీసీ సదస్సుకు జాకీ చాన్

  చైనాలోని బీజింగ్‌లో ఇటీవల జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సదస్సుకు జాకీ చాన్ అతిధుల్లో ఒకరిగా హాజరయ్యారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ హోదాలో వెళ్లిన జాకీ చాన్‌కు అధికారులు, ప్రభుత్వం బ్రహ్మరథం పట్టారు. ఈ సదస్సులో చైనా ప్రసిడెంట్ చేసిన ఉపన్యాసానికి ఆయన ముగ్దుడయ్యాడవ్వడమే కాకుండా రాజకీయాల్లోకి రావాలని స్పూర్తి పొందినట్టు తాజా సమాచారం.

  ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!

  100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో

  100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో

  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రసంగంపై నటుడు జాకీ చాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీసీ గొప్పతనం ఏమిటో నాకు తెలుసు. 100 ఏళ్ల చరిత్రతో ప్రజలతో మమేకమైంది. కొన్ని సంవత్సరాలుగా నేను సీపీసీలో సభ్యుడిని కావాలని కోరుకొంటున్నాను అని జాకీ చాన్ అన్నారు. దీంతో ఆయన ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది. పలువురు ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు.

  బికినీలో దిశా పటానీ అందాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా, మామూలు రచ్చకాదు!

  చైనా అంటే నాకు చాలా ఇష్టం

  చైనా అంటే నాకు చాలా ఇష్టం

  ఇంకా తన ప్రసంగంలో జాకీ చాన్ మాట్లాడుతూ.. నేను ఎన్నో దేశాలు సందర్శించాను కానీ ఇటీవల కాలంలో చైనా అద్భుతమైన అభివృద్దిని సొంతం చేసుకొన్నది. నేను ఎక్కడికి వెళ్లినా చైనా దేశస్థుడిగా గర్వపడుతాను. ఐదు నక్షత్రాల అరుణ పతాకం నాకు ఎప్పుడూ స్పూరిని, దేశభక్తిని కలిగిస్తుంది. హాంకాంగ్, చైనా నాకు జన్మస్థలాలు. నా చైనా నాదేశం, దానిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అని జాకీ చాన్ అన్నారు.

  Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా !
  జాకీ చాన్ లేటేస్ట్ కెరీర్

  జాకీ చాన్ లేటేస్ట్ కెరీర్

  జాకీ చాన్ తాజా సినిమాల విషయానికి వస్తే.. 2020లో వాన్‌గార్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన విష్ డ్రాగన్, ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్, గుడ్ నైట్ బీజింగ్ చిత్రాలు 2021లో రిలీజ్ అయ్యాయి. స్నాఫు, ది డైరీ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.

  English summary
  Chinese and Hollywood actor Jackie Chan likely to entry into Chinese politics, He requested CPC membership to China President Xi Jinping. He attended The centenary celebrations of the Communist Party of China (CPC).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X