»   » తండ్రి మృత్యుపోరాటాన్ని చూసి విలివిలలాడిన పిల్లలు..!!

తండ్రి మృత్యుపోరాటాన్ని చూసి విలివిలలాడిన పిల్లలు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ గత ఏడాది జూన్ 25వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆయన మృత్యుపోరాటాన్ని వీడియోగా తీసి ఇటీవలే ఈ వీడియే డాక్యుమెంటరీని అమెరికా టెలివిజన్ లలో టెలీకాస్ట్ చేసారు. VH1 అనే పాపులర్ క్రైం సీరీస్ లో ఈ వీడుయోను ప్రదర్శించారు. ఇందులో డా.ముర్రే మైఖేల్ జాక్సన్ గుండె ఫంక్షనింగ్ ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుండటం, ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నిస్తుండటం లాంటి సన్నివేశాలు వున్నాయి. ఈ హృదయ విదారకమయిన డాక్యుమెంటరీని చూసిన మైఖేల్ అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇదిలా వుంటే ఈ వీడియోలో తన తండ్రి మృత్యుపోరాటాన్ని వీక్షించిన మైఖేల్ పిల్లలు ప్యారీస్ జాక్సన్, ప్రిన్స్ మైఖేవ్ జాక్సన్ తల్లడిల్లిపోయారట. వీరితో పాటు మైఖేల్ కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోను ఆసాంతం తిలకించి డా.ముర్రే ఎలా తన విధులను నిర్వర్తించడంలో విఫలం అయి మైఖేల్ మరణానికి కారణం అయ్యాడో చూసారట. కాగా ఈ వీడియోలో ముర్రే వైఫల్యం స్పష్టంగా కనిపించిందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu