»   » తను చనిపోతూ ఇతరులకు వెలుగునివ్వాలనుకుంది..!

తను చనిపోతూ ఇతరులకు వెలుగునివ్వాలనుకుంది..!

Subscribe to Filmibeat Telugu

బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో శిల్పాశెట్టి చేత కన్నీళ్లు పెట్టించిన రియాలిటీ స్టార్ జేడ్ గూఢీ చనిపోయి నేటితో సరిగ్గా ఏడాదయింది. తీవ్రమయిన క్యాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాశ విడిచిన ఆమె చనిపోవడానకి ముందు తీవ్రమనో వేధనను అనుభవించింది. తాను త్వరలో చనిపోతానని తెలిసిపోయిన ఆమె ఎలా తన సమస్యను దైర్యంగా ఎదుర్కొందో, ఎంత వేదనను అనుభవించిందో అన్నింటినీ ఓ సినిమాగా రూపొందించి క్యాన్సర్ బాధితులకు చూపించి వారిని ఉత్తేజితులను చెయ్యాలని ఆమె పరితపించేది. దాని ఫలితమే 'జేడ్: ఎ ఇయర్ విత్ అవుట్ హర్' సినిమా.

ట్యూమర్ వల్ల నిస్సత్తువ ఆవహించినా ఆమె ఏ మాత్రం తొనకకుండా లేని ఓపికను కొని తెచ్చుకుని తను కరిగిపోతూ మరింత మందికి వెలుగునివ్వాలనే తలంపుతో ఈ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా త్వరలోనే బ్రిటన్ టెలివిజన్ లో టెలీకాస్ట్ కానుంది. అంతే కాదు ఆమె తన వేధనకు పుస్తక రూపాన్ని కూడా ఇచ్చింది గూఢీ. ఎలా ఈ సమస్యను ఎదుర్కోవాలో అని చాలా సూచనలు చేసింది. తను చనిపోతున్నా.. రోజురోజుకీ క్షీనించిపోతున్నా ఇతరుల కోసం ఆమె పడ్డ తాపత్రయానికి పాదాభివందనాలు చేస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాము.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu