twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో కూడా ఛాన్స్ అందుకోలేకపోయిన జల్లికట్టు.. పోటీగా మరో సినిమా

    |

    93వ ఆస్కార్స్‌ హంగామా మొదలయ్యింది. ఆస్కార్ హిస్టారిలో తొలిసారి 93 దేశాల నుంచి సినిమాలు పోటీలోకి దిగుతున్నాయి. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీకి ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ అయిన మ‌ల‌యాళ మూవీ జ‌ల్లిక‌ట్టు. ఈ సారి ఆస్కార్ భరిలో ఈ సినిమా నిలవడం కాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇంటర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీకి కనీసం షార్ట్‌లిస్ట్ కాలేక‌పోయింది.

    ఈ న్యూస్ ఓ వర్గం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్కార్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీకి ఇండియా నుంచి మొత్తంగా షార్ట్‌లిస్ట్ అయిన సినిమాలు 15. అకాడ‌మీ బుధ‌వారం 9 కేట‌గిరీల‌కు చెందిన షార్ట్‌లిస్ట్‌ల‌ను ప్ర‌కటించింది. ఈ లిస్ట్‌ల నుంచి అకాడ‌మీ ఇప్పుడు ఆస్కార్స్ 2021కు నామినీల‌ను ఎంపిక చేస్తుంది. అయితే ఏ జాబితాలో కూడా జల్లికట్టు నిలవలేదు.

    Jallikattu fails to make it to shortlist for 93 Oscars’

    మ‌రోవైపు క‌రిష్మా దేవ్ దూబె డైరెక్ట్ చేసిన బిట్టూ మాత్రం లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్ కేట‌గిరీకి షార్ట్‌లిస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేట‌గిరీల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్‌, డాక్యుమెంట‌రీ, మేక‌ప్ అండ్ హెయిర్‌స్టైలింగ్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, లైవ్ యాక్ష‌న్ షార్ట్‌ఫిల్మ్‌,ఒరిజిన‌ల్ స్కోర్‌, ఒరిజిన‌ల్ సాంగ్‌, డాక్యుమెంట‌రీ షార్ట్ స‌బ్జెక్ట్‌, ఆనిమేటెడ్ వంటి షార్ట్ ఫిల్మ్ కేట‌గిరీల‌కు షార్ట్‌లిస్ట్‌ల‌ను ఎనౌన్స్ చేయడం జరిగింది. ఇక మార్చి 15న ఆస్కార్స్‌కు నామినేష‌న్లు ప్రకటించిన అనంతరం ఏప్రిల్ 25న బ‌హుమ‌తుల ప్ర‌దానోత్స‌వ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

    English summary
    No Indian film has ever won an Oscar. The last Indian film that made it to the final five in the Best International Feature category was Ashutosh Gowariker's Lagaan in 2001. Mother India (1958) and Salaam Bombay (1989) are the other two Indian movies to have made it to the top five.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X