Daniel Craig రాయల్ నేవిలో కమాండర్‌గా జేమ్స్ బాండ్.. డేనియల్ క్రేగ్‌కు అరుదైన గౌరవం

ప్రపంచవ్యాప్తంగా అద్బుతంగా వెండితెర మీద రాణిస్తూ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న జెమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాయల్ నేవిలో కమాండర్‌గా గౌరవ హోదాను బ్రిటన్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ విషయాన్ని డేనియల్ క్రేగ్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. రాయల్ నేవీలో కమాండర్ హోదాను ఏర్పాటు చేయడం నా జీవితంలో అత్యుత్తమ గౌరవం. ఈ హోదాలో ఎంపిక కావడం నాకు గర్వంగా ఉంది. సీనియర్ ర్యాంక్‌లో సీనియర్‌గా సేవలు అందించే అవకాశం రావడం గొప్ప అనుభూతి అని జేమ్స్ బాండ్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.

తన ట్వీట్‌తోపాటు రాయల్ బ్లూ నేవీ యూనిఫాంను ధరించి ఫోటోకు ఫోజిచ్చాడు. ఆ ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ ఫోటో వైరల్ అయింది. నెటిజన్లు ఆయనకు సోషల్ మీడియాలో విశేషంగా ప్రశంసలు గుప్పించారు. మీకు లభించిన అత్యుత్తమ గౌరవం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

James bond Daniel Craig appointed as honorary Commander by the Royal Navy

ఇక డేనియల్ క్రేగ్ కెరీర్ విషయానికి వస్తే.. జేమ్స్ బాండ్‌గా ఐదో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటించిన నో టైమ్ టూ డై చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రం ఇండియాలో సెప్టెంబర్ 30 తేదీన రిలీజ్ కానున్నది.

రాయల్ నేవీ అధిపతి ఫస్ట్ సీ లార్డ్ అడ్మిరల్ సర్ టోని రాడాకిన్ స్పందిస్తూ.. అత్యుతమ ర్యాంక్‌లో డేనియల్ క్రేగ్‌ను గౌరవ హోదాలో నియమించడం గౌరవంగా భావిస్తున్నాం. ఈ పదవిని చేపట్టిన ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ విభాగం సేవలను ప్రపంచానికి చాటిచెప్పే పాత్రను ఆయన నిర్వహించబోతున్నాడు అని ఆయన అన్నారు.

డేనియల్ క్రేగ్ తన కెరీర్‌లో కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కైఫాల్, స్పెక్ట్రే చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నో టైమ్ టూ డై అనే చిత్రం బాండ్‌‌గా ఐదో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి క్యారీ జోజి ఫుకునాగ. ఈ చిత్రంలో లీ సేడాక్స్, రామీ మాలేక్, అనా డీ అర్మాస్, బెన్ విషా, నోమి హారిస్, జెఫరీ రైట్, క్రిస్టో వాల్ట్స్, రాల్ఫ్ ఫీనెస్ నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X