»   » జేమ్స్‌బాండ్‌ నూతన చిత్రం 'స్పెక్టర్‌' టీజర్‌(వీడియో)

జేమ్స్‌బాండ్‌ నూతన చిత్రం 'స్పెక్టర్‌' టీజర్‌(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో భాగంగా 24వ చిత్రమైన 'స్పెక్టర్‌' టీజర్‌ తాజాగా విడుదలైంది. గతంలో వచ్చిన 'స్కైఫాల్‌'కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో డానియల్‌ క్రెయిగ్‌ మళ్లీ బాండ్‌గా కనిపిస్తున్నారు. ఈ టీజర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది... సోనీ పిక్చర్స్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దాడి చేసిన హాకర్లు సినిమా స్క్రిప్ట్ గతేడాది దొంగిలించారు.

James Bont's SPECTRE TEASER TRAILER

ఈ స్క్రిప్టును బటకు లీక్ చేసారని సోనీ స్టూడియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే యూకే చట్టాల ప్రకారం స్క్రిప్ట్ కు కాపీరైట్ రక్షణ ఉందని, స్క్రిప్ట్ వివరాలు ప్రచురించినా, మరేదైనా చిత్రంలూ వాడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, డానియల్ క్రెగ్ హీరోగా నటిస్తున్న చిత్రం వచ్చే ఈ ఏడాది నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read in Hindi: Hindi
English summary
See the first teaser trailer for the 24th James Bond adventure SPECTRE. A cryptic message from Bond’s past sends him on a trail to uncover a sinister organisation. While M battles political forces to keep the secret service alive, Bond peels back the layers of deceit to reveal the terrible truth behind SPECTRE.
Please Wait while comments are loading...