twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్‌ బాండ్‌ 'విలన్‌' మృతి

    By Srikanya
    |

    న్యూ యార్క్: జేమ్స్‌ బాండ్‌ సినిమాలో విలన్‌ పాత్రతో పాపులర్ అయిన ప్రఖ్యాత హాలీవుడ్‌ నటుడు జాఫ్రే హోల్డర్‌(84) కన్నుమూశారు. జేమ్స్‌ బాండ్‌ సినిమా 'లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌' సినిమాలో బరన్‌ సమేది పాత్రతో ప్రజల్లో జేమ్స్‌ బాండ్‌ విలన్‌గా నిలిచిపోయిన జాఫ్రే న్యూమోనియాతో బాధపడుతూ న్యూయార్క్‌లో ప్రాణాలు వదిలినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

    ‘జాఫ్రే హోల్డర్‌ చాలా మందికి సినిమాల్లో విలన్‌గానే తెలుసు. అయితే నిజ జీవితంలో ఆయన ఎంతగా దయ, దాతృత్వ గుణం గలవారో ఆయనకు సన్నిహితులయిన వారికి మాత్రమే తెలుసని చెప్తున్నారు. జాఫ్రే హోల్డర్‌ తన జీవితంలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. జీవిత చరమాంకంలో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితుల మధ్య గడపటం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది' అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జాఫ్రే హోల్డర్‌ మరణం ఊహించనిదే అయినప్పటికీ గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని తెలిపారు.

     James Bond villain Geoffrey Holder dies aged 84

    ఇక కొద్ది కాలం క్రితమే ...జేమ్స్‌ బాండ్‌ విలన్‌ రిచర్డ్‌ కైల్‌ కాలిఫోర్నియాలో కన్నుమూశారు. కాలు విరగడంతో వారం క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. ఏడడుగుల రెండంగుళాల ఎత్తుగా, స్టీలు పళ్లతో 'జాస్‌' పేరుతో కొన్ని జేమ్స్‌ బాండ్‌ చిత్రాల్లో కనిపించి అలరించారు. 'స్పై హూ లవ్డ్‌ మీ' (1977), 'మూన్‌రేకర్‌' (1979) బాండ్‌ చిత్రాల్లో రిచర్డ్‌ పోషించిన జాస్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా ఇద్దరు విలన్స్ ఈ సంవత్సరం అదీ నెలల తేడాలో మరణించటంతో జేమ్స్ బాండ్ చిత్రాల అభిమానులు భాధపడుతున్నారు.

    English summary
    Geoffrey Holder, the actor, dancer, choreographer, designer and painter, has died at the age of 84. Holder, who was most widely known for playing villain Baron Samedi in the Bond film Live and let Die, passed away in Manhattan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X